రిలయన్స్ జియో కస్టమర్ల కోసం సరికొత్త రిచార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తోంది. తక్కువ ధరల్లోనే డేటా, అపరిమిత కాల్స్ మరెన్నో బెనిఫిట్స్ ను అందిస్తోంది. మీరు చౌక ధరల్లో డేటా, కాల్స్ అందించే ప్లాన్ కోసం చూస్తున్నట్లైతే రూ. 155 కంటే తక్కువ ధరల్లోనే రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్లతో రూజువారి డేటా, కాల్స్, జియో సినిమా ఫ్రీ యాక్సెస్ పొందుతారు. జియో అందించే ప్లాన్లలో అత్యంత చీపెస్ట్ ప్లాన్ రూ. 75. అయితే ఈ ప్లాన్స్ జియో యూజర్స్ అందరికీ మాత్రం కాదు. ఓన్లీ జియో ఫోన్ యూజర్లకు మాత్రమే.
Also Read:Karnataka : కర్ణాటక కాంగ్రెస్ లో ముదురుతున్న అంతర్గత వివాదం
రూ. 75 ప్లాన్:
జియో అందించే ఈ ప్లాన్ తో 23 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. జియో టీవీ, జియో సిమా, జియో క్లౌడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు. మొత్తం 2.5GB వస్తుంది. ప్రతి రోజు 100 MB డేటా పొందొచ్చు. 200MB అదనపు డేటా కూడా వస్తుంది. అపరిమిత కాల్స్, 50 ఉచిత ఎస్ఎంఎస్ లను అందిస్తుంది.
రూ. 91 ప్లాన్:
జియో ఫోన్ యూజర్ల కోసం మరో చౌకైన ప్లాన్ ఇది. ఈ రీచార్జ్ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. డైలీ 0.1GB డేటా పొందుతారు. 200MB అదనపు డేటా కూడా వస్తుంది. అపరిమిత కాల్స్, 50 ఉచిత ఎస్ఎంఎస్ లను అందిస్తుంది. జియో టీవీ, జియో సిమా, జియో క్లౌడ్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు.
Also Read:Moinabad Farmhouse : జడ్జి సమక్షంలో పందెం కోళ్లు వేలం.. రూ.2.50 లక్షలు పలికిన పది కోళ్లు
రూ. 125 ప్లాన్:
ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 23 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ప్రతి రోజు 0.5GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తో అన్ లిమిటెడ్ కాల్స్, 300 ఫ్రీ ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. ఈ ప్లాన్ జియో సినిమాకు ఫ్రీ యాక్సెస్ అందిస్తుంది.
Also Read:Vivo V50: కేక పుట్టించే ఫీచర్లతో.. మార్కెట్ లోకి విడుదలైన వివో మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్
రూ. 152 ప్లాన్:
ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు. డైలీ 0.5GB డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్ లు పొందుతారు. ఈ ప్లాన్ జియో సినిమాకు ఫ్రీ యాక్సెస్ అందిస్తుంది.