NTV Telugu Site icon

Reliance Jio: చైనా కంపెనీని వెనక్కి నెట్టిన జియో!.. డెటా వినియోగంలో ప్రపంచంలోనే నంబర్ వన్..

Reliance Jio

Reliance Jio

రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగంలో నంబర్ వన్ కంపెనీగా అవతరించింది. చైనా కంపెనీలను వెనక్కు నెట్టేసింది. రిలయన్స్ జియో యొక్క జూన్ త్రైమాసిక గణాంకాలు తాజాగా వెల్లడించింది. అందులో కంపెనీ డేటా వినియోగం 4400 కోట్ల జీబీని మించిపోయింది. గతేడాది గణాంకాలతో పోలిస్తే ఈ సారి 33 శాతం పెరిగింది. దేశంలోని కస్టమర్లు రోజూ సగటున 1జీబీ (GB) కంటే ఎక్కువ డేటాను వినియోగిస్తున్న ఏకైక కంపెనీగా జియో అవతరించింది.

READ MORE: Uttam Kumar Reddy: కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసి నిర్మించారు..

జియో కస్టమర్లు 5G డేటాను విరివిగా ఉపయోగిస్తున్నారు. పెద్ద మొత్తంలో డేటాను ఉపయోగించే 5G కస్టమర్ల సంఖ్య దాదాపు 13 కోట్లకు చేరింది. అయితే.. 5G ఇప్పటికీ వినియోగదారులకు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా అందుబాటులో ఉంది. అర్హత కలిగిన కస్టమర్‌లు 4G డేటా ప్లాన్‌తో రీఛార్జ్‌పై అపరిమిత 5G డేటాను కూడా ఉపయోగించవచ్చు. ప్రస్తుతం జియోకు 49 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. గత సంవత్సరంలోనే కంపెనీ 4 కోట్లకు పైగా కస్టమర్లను చేర్చుకుంది.

READ MORE: Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. 3 ఏళ్లలో 3 వైకల్య సర్టిఫికేట్లు..

మొబైల్ వినియోగదారులే కాదు.. ఫిక్స్‌డ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ పరంగా కూడా కంపెనీ రికార్డులు సృష్టించింది. 10 లక్షలకు పైగా ఇళ్లు మరియు ప్రాంగణాలకు ఎయిర్‌ఫైబర్‌ను అందించిన మొదటి టెలికాం కంపెనీగా జియో అవతరించింది. ఇంటర్నెట్‌తో పాటు, జియో వినియోగదారులు వాయిస్ కాలింగ్‌లో కూడా ముందున్నారు. జూన్ త్రైమాసికంలో వాయిస్ కాలింగ్ విషయంలో కంపెనీ 6 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఇప్పుడు రికార్డు స్థాయి 1.42 ట్రిలియన్ నిమిషాలకు చేరుకుంది.

READ MORE:Rammohan Naidu: రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరం.. నిధులను ఏపీకి రప్పిస్తాం..

డిజిటల్ ఇండియాకు వెన్నెముక, అధిక కవరేజీతో సరసమైన ఇంటర్నెట్ అందిస్తున్న సంస్థ జియో అని కంపెనీ ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ ఎం అంబానీ అన్నారు. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు, 5G సేవలు, AI సెక్టార్‌లో ఆవిష్కరణ వృద్ధిని పెంచుతాయన్నారు. రాబోయే కాలంలో జియో మెరుగైన నెట్‌వర్క్, సేవల ఆధారంగా మార్కెట్‌లో తన నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.