NTV Telugu Site icon

Jio and Vi Festive Deals: స్పెషల్‌ ఆఫర్లకు జియో, ఐడియా గుడ్‌బై.. త్వరపడితేనే మరి..!

Jio And Vi

Jio And Vi

దీపావళి ముగిసింది.. ఇక, తన వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పేందుకు సిద్ధం అయ్యాయి టెలికం సంస్థలు.. రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ ఐడియా ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ప్రత్యేక దీపావళి ఆఫర్‌లను ప్రారంభించాయి. అయితే, ఆ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉండేవే.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, అదనపు డేటా మరియు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాలు కలిగిఉన్న ఆ ప్లాన్లను త్వరలోనే నిలిపివేసేందుకు సిద్ధం అయ్యాయి ఆ టెలికం సంస్థలు.. దీపావళి సందర్భంగా ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి.. కానీ, ఈ రీఛార్జ్ ప్లాన్లు తర్వాత అందుబాటులో ఉండవు. కావాలనుకుంటే ఇప్పుడే వాటిని రీఛార్జ్ చేసుకుంటే తప్ప..

Read also: Bhumana Karunakar Reddy: ‘సీమ’లోనూ మూడు రాజధానుల ఉద్యమం.. 29న తిరుపతిలో ‘ఆత్మగౌరవ’ ప్రదర్శన

ఇక, దీపావళి సందర్భంగా రిలయన్స్‌ జియో, వొడా ఫోన్‌ తెచ్చిన ఆ ప్రత్యేక ఆఫర్లు ఏంటి? అనే విషయానికి వస్తే.. జియో స్పెషల్ దీపావళి సెలబ్రేషన్ ఆఫర్‌ను తీసుకొచ్చింది.. ఈ ప్లాన్‌లో రూ.2,999తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.. ఇది రీచార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేసుకునే బాధ ఉండదన్నమాట.. ఈ ప్లాన్‌ కింద ప్రతీరోజు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా అందిస్తుంది.. ఇక, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌.. రోజువారీ 2.5 జీబీ హై స్పీడ్ డేటా పొందవచ్చు.. అంతేకాదు.. అదనంగా మరో 75జీబీ డేటాను కూడా ఉచితంగా పొందేవీలుంది.. ఇక, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా పొందో సౌలభ్యం కల్పించింది. మరోవైపు జియో దీపావళి సెలబ్రేషన్ ఆఫర్‌లో జూమిన్ నుండి ఉచిత మాగ్నెట్‌లు, ఎయిర్‌లైన్ బుకింగ్‌పై ఇక్సిగోపై రూ. 750 తగ్గింపు, అజియోపై రూ. 1,000 తగ్గింపు, అర్బన్ లాడర్‌పై రూ. 1,500 తగ్గింపు మరియు రిలయన్స్ డిజిటల్‌పై రూ. 1,000 తగ్గింపు కూడా ఉన్నాయి. ఇవి త్వరలోనే ముగియనున్నాయి.. అవి పొందాలంటే వెంటనే రీచార్జ్‌ చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు.

మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా ఆకట్టుకునే ప్లాన్స్‌ తీసుకొచ్చింది.. వీఐ రూ.1,449తో 180 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది.. రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు 1.5జీబీ ఉచిత డేటా, దీనికి అదనంగా మరో 50జీబీ డేటా ఇస్తుంది.. ఇక, రూ.2,899 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, 1.5జీబీ ఉచిత డేటా పొందే వీలుంది.. అదనంగా మరో 75జీబీ డేటా ఇస్తుంది.. మరోప్లాన్‌ రూ.3,099తో 365 రోజుల వ్యాలిడిటీ.. రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, 2 జీబీ ఉచిత డేటా అందిస్తుండగా.. అదనంగా 75జీబీ డేటా పొందవచ్చు.. అలాగే, ఏడాది పాటు డిస్నీ హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ కూడా ఆఫర్‌లో భాగమే.. అయితే, వీఐ దీపావళి ఆఫర్‌ల కింద తీసుకొచ్చిన మూడు ప్రీపెయిడ్ ప్లాన్లు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి.. ఆ ప్రయోజనాల పొందాలంటే.. ఆ లోపుగానే రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Show comments