దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 215 పాయింట్లు లాభపడి 22,635 వద్ద ముగియగా.. సెన్సెక్స్ 941 పాయింట్లు పెరిగి 74,671 కి చేరుకుంది. ఇక నేడు సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో ఐసీసీఐ బ్యాంక్, ఎస్బిఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ , కోటక్ మహీంద్రా బ్యాంక్, టిసిఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఫ్సీ బ్యాంక్, నెస్లే, సన్‌ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా మరియు ఎల్&టి కంపెనీలు షేర్లు లాభాల్లో ముగిసాయి.
Also Read: T20 World Cup: టీ20 వరల్డ్ కప్లో కోహ్లీ ఉండాల్సిందే..! తేల్చిచెప్పిన కెప్టెన్
ఇక మరోసారి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ సుజుకీ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.3,408.88 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,356.83 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.48గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 88.90 గా ఉంది.
Also Read: Heart health: కరోనరీ హార్ట్ డిసీజ్ కి డయాబెటిస్ కారణమవుతోందా..?
ఇక నేడు ఇండెక్స్ భారీగా పెరగడానికి కారణం చూస్తే.. ఇండెక్స్ పనితీరులో ఐసీసీఐ బ్యాంక్, ఎస్బిఐ ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఐసీసీఐ షేర్లు మంచి త్రైమాసిక ఫలితాలను నివేదించిన తర్వాత మంచి పనితీరును కనబరిచాయి. ఫలితాల తర్వాత ఎస్బిఐ షేర్లు కొనుగోలు మద్దతును పొందాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల పటిష్ట అభివృద్ధి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పెరగడానికి మరో కారణం. సోమవారం ఆసియా మార్కెట్లు లాభాలతో ముగియగా, యూరప్ మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ప్రకటించనున్న ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాన్ని ఇన్వెస్టర్లు గమనిస్తున్నారు. ఇకమరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు దోహదపడింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం సడలించడం వల్ల చమురు ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి.