Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market Crash: భారతీయ స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు తీవ్రంగా కుదిపేస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే రూ.21 లక్ష కోట్ల సంపద ఆవిరైపోయింది! ముడి చమురు ధరల అసాధారణ పెరుగుదల, దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందన్న భయాల కారణంగా మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి భారీగా పెరిగింది. దీంతో గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనూ సెన్సెక్స్ నష్టాలతోనే ముగిసింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.20.79 లక్ష కోట్లు ఆవిరైపోయింది. ఈ ఒక్క వారంలోనే సెన్సెక్స్ ఏకంగా 1,600 పాయింట్లకు పైగా పడిపోయింది.
శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 125.56 పాయింట్లు (0.17 శాతం) నష్టపోయి 73,123.83 వద్ద ముగిసింది. పండుగ సెలవుల కారణంగా ఈ వారం ట్రేడింగ్ రోజులు తక్కువగా ఉన్నప్పటికీ, సెన్సెక్స్ మొత్తం మీద 1,605.44 పాయింట్లు (2.15 శాతం) కోల్పోయింది. అక్టోబర్ 16న బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.4,72,62,167.42 కోట్లుగా ఉండగా.. కేవలం నాలుగు రోజుల్లోనే అది రూ.4,51,83,393.14 కోట్లకు పడిపోయింది. ఇక, భారత స్టాక్ మార్కెట్లు ఇంత భారీగా పడిపోవడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ముప్పు మదుపర్లను కలవరపెడుతున్నాయి. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 116.73 డాలర్లకు ఎగబాకడంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాలు ముంచుకొచ్చాయి. పెరిగిన చమురు ధరల వల్ల ఆర్థిక వ్యవస్థపైనా, కంపెనీల నిర్వహణ ఖర్చులపైనా తీవ్ర భారం పడుతుందని భావించిన మదుపర్లు పెద్ద ఎత్తున షేర్లను విక్రయించారు. ఇవే కాకుండా అమెరికా మార్కెట్లలోని బలహీనతలు, రూపాయి మారకం విలువ పడిపోవడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం వంటి పరిణామాలు కూడా మన దేశ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
Also Read
ముఖ్యంగా ముడి చమురు ధరల భగ్గుమంటుండటంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. పశ్చిమాసియాలో అశాంతి కారణంగా చమురు సరఫరా నిలిచిపోతుందనే భయంతో బ్రెంట్ క్రూడాయిల్ ధర ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై దాడుల అంచనాలు, యెమెన్ హూతీ రెబెల్స్ సౌదీ అరేబియా చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి పరిణామాలు మార్కెట్లో అనిశ్చితిని మరింత పెంచాయి. ఈ మార్కెట్ పతనంలో కొన్ని కంపెనీల షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ షేర్లు 3 శాతానికి పైగా పడిపోయి అత్యధిక నష్టాలు చవిచూసిన జాబితాలో నిలిచాయి. ట్రెంట్, టెక్ మహీంద్రా, బీఈఎల్, ఇండిగో, బజాజ్ ఫిన్సర్వ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హిందుస్థాన్ యునిలీవర్ షేర్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. అయితే ఇదే సమయంలో ఎటర్నల్, ఎల్అండ్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు మాత్రం లాభాలను ఆర్జించడం విశేషం.
రూపాయి బలహీనపడటం, విదేశీ మార్కెట్ల పతనం కూడా మన దేశంపై ప్రభావం చూపాయి. అమెరికా మార్కెట్లు పడిపోవడంతో భారతీయ మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఆసియాలోని ఇతర మార్కెట్లలో కొంత కోలుకున్నప్పటికీ, మన దేశంలో మాత్రం పెరిగిన చమురు ధరలు, బాండ్ ఈల్డ్స్ కారణంగా ఆందోళన కొనసాగింది. ఇక, రాబోయే రోజుల్లో మార్కెట్ గమనాన్ని మార్చే కొన్ని కీలక పరిణామాలు ఎదురుకానున్నాయి. మదుపర్ల చూపు ప్రధానంగా జియో ప్లాట్‌ఫారమ్స్ షేర్ల మార్కెట్ ఎంట్రీపై ఉంది. రూ.30,213 కోట్ల విలువైన ఈ ఐపీఓ 22.19 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, అక్టోబర్ 28న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానుంది. దీనికి వస్తున్న స్పందన మార్కెట్ ట్రెండ్‌కు అద్దం పట్టనుంది. అలాగే అక్టోబర్ 27, 28 తేదీల్లో జరగనున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సమావేశంపై అందరి దృష్టి ఉంది. అమెరికాలో నిరుద్యోగ వివరాలు, జీడీపీ వృద్ధి అంచనాలు, జపాన్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలు కూడా గమనించదగ్గ అంశాలు. వీటితో పాటు పేటీఎం, టాటా కన్స్యూమర్, ఎల్అండ్టీ, మారుతి సుజుకి, హిందుస్థాన్ యునిలీవర్, అదానీ పోర్ట్స్, ట్రెంట్, సన్ ఫార్మా, బీఈఎల్ వంటి ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్ దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మొత్తానికి, ముడి చమురు ధరలు శాంతించడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం, విదేశీ మదుపర్ల పెట్టుబడులు మళ్లీ పుంజుకోవడం, కంపెనీల నుంచి మెరుగైన ఫలితాలు రావడం వంటి అంశాలపైనే భారతీయ స్టాక్ మార్కెట్ కోలుకోవడం ఆధారపడి ఉంటుంది. రూపాయి విలువ బలపడి, అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గితేనే మదుపర్లలో మళ్లీ నమ్మకం కుదిరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Stock Market Crash: నాలుగు రోజుల్లో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ఐదు కారణాలు ఇవే..
-
Jakkampudi Raja: వైసీపీ అభ్యర్థిపై దాడి కేసు.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
-
Mumbai Indians: 2027 ఐపీఎల్ కప్ లక్ష్యంగా ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టుకు కొత్త హెడ్ కోచ్ నియామకం..
-
Hyderabad: పవర్‌గ్రిడ్ మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా కలకలం.. అటెండెంట్ అరెస్ట్.. సైబర్ క్రైమ్‌కు కేసు బదిలీ
-
Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదని అనుకుంటున్నారా?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!