Rupee Falls: భారత రూపాయి నేడు మరింత పతనమైంది. ఈ నేపథ్యంలో తొలిసారిగా డాలర్‌తో పోలిస్తే 90 మార్కును దాటింది. అంతకుముందు రోజు నమోదైన 89.9475 కనిష్ట స్థాయిని బద్దలు కొడుతూ.. రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో రూ.90.13 వద్ద కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (India-US trade deal)పై అనిశ్చితి పెరగడం, బలహీనమైన వాణిజ్యం ఇంకా పోర్ట్‌ఫోలియో ప్రవాహాల (Portfolio Flows) కారణంగా ఈ పతనం మొదలయింది. దీనితో ట్రేడింగ్ సెషన్ లో రూపాయిపై భారీ ఒత్తిడిని కొనసాగించింది.
ఈ రూపాయి పతనం దేశీయ ఈక్విటీ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. రూపాయి బలహీనపడటం అనేది ద్రవ్యోల్బణం (Inflation), విదేశీ పెట్టుబడిదారుల కార్యకలాపాల (FII activity)పై ఆందోళనలను పెంచడంతో.. నిఫ్టీ ఇండెక్స్ 26,000 మార్కు దిగువకు పడిపోయింది. సెన్సెక్స్ కూడా ప్రారంభ ట్రేడింగ్‌లో దాదాపు 200 పాయింట్లు తగ్గింది. రూపాయి స్థిరత్వం, వాణిజ్య చర్చల స్పష్టత కోసం వ్యాపారులు ఎదురుచూస్తున్నందున మార్కెట్ ఒడిదుకులకు లోనవుతుందని విశ్లేషకులు తెలిపారు.