Tamilnadu: ఏడేళ్లలో.. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తమిళనాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడు రాష్ట్రం రానున్న రోజుల్లో బలమైన ఆర్థిక వ్యవస్థ గల రాష్ట్రంగా ఏర్పడాలని అడుగులు వేస్తోంది. ఏడేళ్లలో .. లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తమిళనాడు పావులు కదుపుతోంది. మరో ఏడేళ్లలో వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అవతరించాలని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుంది. టార్గెట్ పెట్టుకోవడానికి ఏముంది.. ఆచరణలో సాధ్యం కావాలి కదా..? అని అనుకుంటున్నారా..? అయితే తమిళనాడులోని స్టాలిన్ సర్కారు అడుగులు మాత్రం ఆ దిశగానే పడుతున్నాయి. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో తమిళనాడు రాష్ట్రం అగ్రస్థానానికి చేరుకుంది. 2020-21లో తమిళనాడు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ.13,641 కోట్లు కాగా.. 2022-23లో అది రూ.44 వేల కోట్లు దాటింది. ఈ రెండేళ్లలో తమ రాష్ట్రం నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 223 శాతం మేర పెరిగాయని తమిళనాడు సర్కారు ప్రకటించింది. ఎలక్ర్టానిక్స్ ఎగుమతుల్లో ఉత్తర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఇందులో భాగంగానే.. 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులేస్తున్నామని రాష్ట్ర సర్కార్ ప్రపకటించింది.
Read also: Sitara Commercial Ad: సితార తొలి కమర్షియల్ యాడ్.. టైమ్ స్వ్కేర్‌పై ఫొటోల ప్రదర్శన!
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 3.75 లక్షల ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి ఇది 7 లక్షల ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో దక్షిణాది రాష్ట్రాల వాటా 35 శాతంగా ఉంటుందనే అంచనాలున్నాయి. ఇప్పటికి తమ ఆర్థిక వ్యవస్థను లక్ష కోట్ల డాలర్లకు చేర్చాలని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుంది. పలు మల్టీ నేషనల్ కంపెనీలు తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను చైనా వెలుపలకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తుండగా… భారత్ వాటిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. వాటిల్లో ఎక్కువ యూనిట్లను తమిళనాడు ఆకర్షించే అవకాశం ఉంది. సుదీర్ఘ సముద్ర తీరం, చెన్నై పోర్టు, ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం, మానవ వనరుల లభ్యత తమకు కలిసి వస్తుందని తమిళనాడు ధీమాతో ఉంది. పైగా జీఎస్‌డీపీలో సౌత్‌లో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో కర్ణాటక ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు జీఎస్‌డీపీ రూ.24.8 లక్ష కోట్లు కాగా.. కర్ణాటక జీఎస్‌డీపీ రూ.22.4 లక్షల కోట్లుగా ఉంది. తెలంగాణ జీఎస్‌డీపీ రూ.13.3 లక్షల కోట్లు కాగా.. ఏపీ జీఎస్‌డీపీ రూ.13.2 లక్షల కోట్లు, కేరళది రూ.10 లక్షల కోట్లు. ఏపీ, తెలంగాణ కలిపి చూస్తే.. రూ.26.5 లక్షల కోట్లు. ఏపీ విడిపోవడం వల్ల దక్షిణాదిలో తమిళనాడు ఆర్థిక వ్యవస్థ మరింత పెద్దదిగా కనిపిస్తుందనేది వాస్తవం. 2030 నాటికి లక్ష్యాన్ని చేరుకున్నా, చేరుకోలేకపోయినా.. లక్ష ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే తొలి లేదా రెండో దక్షిణాది రాష్ట్రంగా తమిళనాడు నిలిచే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
Read also: Road Accident: ముంబై-ఆగ్రా హైవేపై ఘోర ప్రమాదం.. హోటల్‌లోకి కంటైనర్.. 12 మంది మృతి
ప్రపంచంలో సుమారు 200 దేశాల వరకు ఉండగా.. 20 దేశాలు కూడా లక్ష కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోలేదు. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే సమయానికి ఇండియా ఎకానమీ 274 బిలియన్ డాలర్లు మాత్రమే. ఆర్థిక సంస్కరణాల తర్వాత భారత వృద్ధి వేగం పుంజుకుంది. 2007లో ఇండియా వన్ ట్రిలియన్ డాలర్ క్లబ్‌లో చేరింది. 2014లో 2 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ 9 ఏళ్లలో దాదాపు రెట్టింపయ్యి 3.75 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. మరో ఏడేళ్లలో ఇది రెట్టింపు అయితే.. ఇండియా ఎకానమీ 7 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుంది. అదే సమయంలో తమిళనాడు, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉంది. 2027 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని ఉత్తర ప్రదేశ్, కర్ణాటక లక్ష్యంగా పెట్టుకున్నాయి. దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మహారాష్ట్ర 2030 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవతరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఆ దిశగా ఆయా రాష్ట్రాలు తమ లక్ష్యాలను సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!