Home Loan: వడ్డీ రేట్లను పెంచేసిన బ్యాంకులు.. హోంలోన్లపై భారం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యే వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.. దీంతో రెపో రేటు 4.40 శాతానికి చేరింది. ఇక, ఆర్బీఐ చర్యను ఊహించిన కొన్ని బ్యాంకులు ముందుగానే తమ ఎంసీఎల్ఆర్ రుణ వడ్డీరేట్లు పెంచేశాయి. రెపోరేట్ పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంసీఎల్ఆర్‌తోపాటు వడ్డీరేట్లు పెంచేశాయి పలు బ్యాంకులు..
Read Also: Cyclone Asani: ‘అసని’ తీవ్ర తుఫాన్.. అప్రమత్తమైన నావికాదళం
Also Read
- Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పీఎన్బీ, ఎస్బీఐ ఇలా చాలా బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి.. ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే, ఐ-ఈబీఎల్ఆర్‌ను 8.10 శాతంగా ఖరారు చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచే అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నెల 5వ తేదీన రిటైల్ రుణాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా రెపోరేట్ అనుబంధ రుణ వడ్డీరేటు 6.90 శాతానికి పెంచేసింది. మరోవైపు, కెనరా బ్యాంకు అన్ని రకాల రిటైల్ రుణాలపై రెపోరేట్ అనుసంధాన రుణ రేటు 7.30 శాతానికి పెంచేసింది. ఇది మే 7 నుంచి అమలు చేస్తోంది. ఇక, మే ఒకటో తేదీ నుంచే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రిటైల్ లెండింగ్ స్కీమ్స్‌పై వడ్డీరేటు 6.80 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెపోరేట్ అనుబంధ ఆర్బీఎల్ఆర్ ఈ నెల 4వ తేదీ నుంచి 7.25 శాతానికి సవరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో దానిని 6.90 శాతానికి పెంచింది. ఇది ప్రస్తుత రుణ గ్రహీతలకు వచ్చే ఒకటో తేదీ నుంచి, నూతన కస్టమర్లకు ఈ నెల ఏడో తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది పీఎన్‌బీ.. మరోవైపు.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అన్ని టెన్యూర్ల రుణ గ్రహీతలపై ఎంసీఎల్ఆర్ 25 బేసిక్ పాయింట్లు పెంచేశాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ఎంసీఎల్ఆర్ 7.15 శాతం అమల్లోకి తెచ్చింది. ఇంతకుముందు ఎంసీఎల్ఆర్ 6.9 శాతంగా ఉండేది. ఏడాది గడువుగల రునాలపై ఎంసీఎల్ఆర్ 7.50 శాతం, రెండేండ్ల గడువు గల రుణాలపై 7.60 శాతం, మూడేండ్ల గడువు గల రుణాలపై 7.70 శాతం ఖరారు చేసింది. మరోవైపు, ఎస్బీఐ ఇటీవలే తన రుణాలపై ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెంచింది. ఇది ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.. ఇక, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ నెల ఒకటో తేదీ నుంచి తన ఎంసీఎల్ఆర్‌ను 6.60-7.70 శాతం మధ్య సవరించగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.60-7.55 శాతం మధ్య వడ్డించింది. ఈనెల రెండో తేదీ నుంచి యెస్ బ్యాంక్ అన్ని రుణాలపై ఎంసీఎల్ఆర్ 10-15 బేసిక్ పాయింట్లు పెంచారు. దీని ప్రకారం యెస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 6.85 – 8.60 శాతం మధ్య పెరిగింది. ఇక, యాక్సిస్ బ్యాంక్ గత నెల 18న ఎంసీఎల్ఆర్ 5 బేసిక్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో.. యాక్సిస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 7.15-7.30 శాతం మధ్య ఖరారైంది. మొత్తంగా.. అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో.. గృహరుణాలు, ఇతర రుణాలు మరింత ప్రియం కానున్నాయి.
తాజావార్తలు
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!