US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం పశ్చిమాసియాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆర్థిక విప్లవానికి నాంది పలికింది. ఇరు దేశాల మధ్య కుదిరిన MoUతో అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం, అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలగిపోవడం వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌ను చల్లబరిచాయి. ఫలితంగా, గతంలో $100 మార్కును దాటి ఉడికించిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 1.13% క్షీణించి బారెల్‌కు $78.65 వద్దకు పడిపోయింది. అలాగే అమెరికన్ డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ సైతం 2.20% తగ్గి బారెల్‌కు $75 వద్ద ట్రేడ్ అవుతోంది. తన చమురు అవసరాలలో దాదాపు 85% దిగుమతుల పైనే ఆధారపడే భారత్‌కు, ఈ ముడి చమురు ధరల పతనం ఊహించని వరంలా మారింది. ఈ అంతర్జాతీయ డీల్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుడికి చేకూరనున్న 5 ప్రధాన ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. పెట్రోల్, డీజిల్ ధరల ఉపశమనం
Also Read
- Best Investment Plans: పిల్లల భవిష్యత్తు కోసం.. అద్భుతమైన పెట్టుబడి మార్గాలు.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిందే
- Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
- Pizza Hut Success Story: అప్పులతో మొదలైన పిజ్జా బిజినెస్.. నేడు ఎన్ని వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదిగిందో తెలుసా?
- RBI New Rules: ఇక బ్యాంకుల దౌర్జన్యానికి చెక్.. ఆర్బీఐ న్యూ రూల్స్.. బ్యాంకు కస్టమర్లకు భారీ ఊరట
హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ఇటీవల భారత్‌లో కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు లీటరుకు సుమారు రూ. 7 వరకు పెరిగాయి. అంతర్జాతీయ నిపుణుల లెక్కల ప్రకారం.. బారెల్ ముడి చమురు ధర $1 పెరిగితే, దేశీయంగా లీటర్ ఇంధనంపై 50-60 పైసల భారం పడుతుంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు $80 దిగువకు పడిపోవడంతో, చమురు కంపెనీల ఉత్పత్తి మరియు రవాణా వ్యయం గణనీయంగా తగ్గనుంది. దీనివల్ల త్వరలోనే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
2. ద్రవ్యోల్బణానికి (ధరల పెరుగుదలకు) బ్రేక్
దేశంలో రవాణా రంగానికి డీజిల్ ధరలే కీలకం. ఇంధన ధరలు తగ్గినప్పుడు రవాణా ఖర్చులు (Freight Costs) అదుపులోకి వస్తాయి. దీనివల్ల నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయలు, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. ముడి చమురు ధరల పతనం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా స్పష్టం చేసింది.
3. తగ్గుముఖం పట్టనున్న దిగుమతి బిల్లు
భారత్ ప్రస్తుతం ప్రతిరోజూ దాదాపు 50 లక్షల బారెళ్ల (5 Million Barrels) చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ప్రతి $10 తగ్గితే.. భారత్ వార్షిక చమురు దిగుమతి బిల్లుపై సుమారు $13-15 బిలియన్ల (దాదాపు రూ. 1.1 – 1.3 లక్షల కోట్లు) భారం తగ్గుతుంది. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలు సురక్షితంగా ఉంటాయి.
4. రూపాయి బలోపేతం & కరెంట్ అకౌంట్ లోటుకు కట్టడి
గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ, డాలర్‌తో పోలిస్తే రూ. 95 మార్కును దాటిన భారత కరెన్సీ (రూపాయి)కి ఈ చమురు ధరల తగ్గుదల పెద్ద ఊరటనిచ్చింది. చమురు కొనుగోళ్లకు తక్కువ డాలర్లు ఖర్చు అవ్వడం వల్ల రూపాయి తిరిగి బంప్ అవుతుంది. మరోవైపు, క్రూడ్ ధరలో ప్రతి $10 తగ్గుదలకు, దేశ జీడీపీలో కరెంట్ అకౌంట్ లోటు (CAD) దాదాపు 0.3% నుంచి 0.4% వరకు తగ్గుతుందని ఆర్బీఐ అంచనా వేసింది.
5. స్టాక్ మార్కెట్లకు ఊపు
ముడి చమురు ధరలు తగ్గడం వల్ల చమురును ముడిసరుకుగా ఉపయోగించే పెయింట్స్, టైర్లు, ఏవియేషన్ (విమానయానం), సిమెంట్, లాజిస్టిక్స్, కెమికల్ కంపెనీల ఇన్పుట్ ఖర్చులు తగ్గుతాయి. వ్యయాలు తగ్గి లాభాలు పెరగడంతో ఈ రంగానికి చెందిన కంపెనీల షేర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. ఫలితంగా భారతీయ స్టాక్ మార్కెట్లు (సెన్సెక్స్, నిఫ్టీ) భారీ లాభాల బాట పట్టేందుకు ఇది దోహదం చేస్తుంది.
తాజావార్తలు
-
Smriti Mandhana: నేను బాగా ఆడలేదు.. ఆమె ఆటకు ఫిదా అయ్యా.. స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Road Accidents: తెలంగాణలో ఒకే రోజు మూడు ఘోర ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం..
-
US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక డీల్.. సామాన్యుడికి కలిగే 5 భారీ లాభాలు ఇవే!
-
Jio Recharge Plans: జియో రూ.949 vs రూ.1029 ప్లాన్.. 84 రోజుల వ్యాలిడిటీ.. ఏది బెస్ట్?
-
Mamata Banerjeeకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!