మగువలకు గుడ్‌న్యూస్. బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు.. గురువారం మాత్రం స్వల్పంగా తగ్గాయి. రోజుకోలాగా బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. ఇక ఈరోజు తులం గోల్డ్‌పై రూ.110 తగ్గగా.. కిలో వెండిపై మాత్రం రూ.2,000 పెరిగింది. దీంతో సిల్వర్ ధర రికార్డ్ స్థాయిలో దూసుకుపోతుంది.
ఇది కూడా చదవండి: Machado: నెలల తర్వాత పబ్లిక్‌గా కనిపించిన నోబెల్ శాంతి గ్రహీత మచాడో
బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.110 తగ్గగా.. రూ.1,30,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 100 తగ్గగా రూ.1,19,350 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.80 తగ్గగా రూ.97,650 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Erika kirk: చార్లీ కిర్క్ హత్యపై స్నేహితురాలు సంచలన ఆరోపణలు.. ఎరికా కిర్క్ తీవ్ర ఆగ్రహం
ఇక సిల్వర్ ధర మాత్రం హడలెత్తిస్తోంది. ఈరోజు ఏకంగా కిలో వెండిపై రూ.2,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ.2,09,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,01, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
