Silver Rates: వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? అమాంతంగా పెరిగిపోయిన వెండి ధర

  • వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది?
  • అమాంతంగా పెరిగిపోయిన వెండి ధర
  • పసిడి దూకుడే.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్
Silver (1)

Silver (1)

వామ్మో.. సిల్వర్ ధర మళ్లీ ఝలక్ ఇస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంతలోనే మళ్లీ ఏమైందో.. ఏమో తెలియదు గానీ మళ్లీ దూకుడు పెంచింది. ఈరోజు అమాంతంగా కిలో వెండిపై రూ.25,000 పెరిగిపోయింది. అలాగే పసిడి కూడా భారీ షాకిచ్చింది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 2,070 పెరిగింది.

ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.25,000 పెరగడంతో రూ.3,00, 000 దగ్గర అమ్ముడవుతోంది. అలాగే హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా అదే మాదిరిగా రూ.3,00, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Mukul Roy: మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత

ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,070 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,350 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,900 పెరగడంతో రూ.1,47,900 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,550 పెరగడంతో రూ.1,21,010 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో ఘోరం.. నదిలో పడ్డ బస్సు.. 18 మంది మృతి