హమ్మయ్య.. బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. నిన్నామొన్నటి దాకా రాకెట్‌లా దూసుకెళ్లిన ధరలు.. నెమ్మది నెమ్మదిగా డౌన్ అవుతున్నాయి. నిన్నటి ఒరవడి ఈరోజు కొనసాగుతోంది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,070 తగ్గగా.. కిలో వెండిపై రూ.25,000 తగ్గింది. దీంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.
ఇది కూడా చదవండి: Navy Officer Missing: చైనా వెళ్తున్న ఓడలో ఒడిశా నేవీ అధికారి సార్థక్ మిస్సింగ్
తులం గోల్డ్‌పై రూ.2,070 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,52,350 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,900 తగ్గడంతో రూ.1,39,650 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,560 తగ్గడంతో రూ.1,14,260 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka : మహాత్మా గాంధీ ఏ పాపం చేశారని ఉపాధి పథకంలో ఆయన పేరు తొలగించారు
వెండి ధర భారీ ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై ఏకంగా రూ.25,000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,75, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి రూ.2,80,000 దగ్గర కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి ధర రూ.2,75, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
