Gold Rates: మగువలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

  • మగువలకు బిగ్ షాక్
  • 2 రోజులు తగ్గినట్టే తగ్గి హడల్
  • భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
Gold5

Gold5

పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్‌లో రెండు రోజులు వరుసగా బంగారం, వెండి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు సంబరపడ్డారు. ధరలు తగ్గుముఖం పట్టొచ్చని అంతా భావించారు. కానీ అంతలోనే బిగ్ షాకిచ్చింది. బుధవారం ఒకేసారి భారీగా పెరిగిపోయింది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.6,600 పెరగగా.. కిలో వెండిపై రూ.40,000 పెరిగింది. దీంతో సామాన్యుల గుండె మళ్లీ ఝళ్లుమంది.

ఇది కూడా చదవండి: UP: ఉసురు తీసిన ‘ఆన్‌లైన్ గేమింగ్’.. 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

తులం గోల్డ్‌పై రూ.6,600 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,60,530 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.6,050 పెరగడంతో రూ.1,47,150 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.4,950 పెరగడంతో రూ.1,20,400 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Deepika Padukone: తల్లిగా బాధ్యతలు.. నటిగా కొత్త పాఠాలు.. దీపికా పదుకొణె ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ!

వామ్మో.. వెండి మళ్లీ భారీ షాకిచ్చింది. ఏకంగా కిలో వెండిపై ఏకంగా రూ.40,000 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,20, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి ధర రూ.3,20, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.