క్రిస్మస్ పండగ వేళ కూడా మగువలకు బంగారం ధరలు షాకిచ్చాయి. నిన్న భారీగా పెరిగిన సిల్వర్ ధర ఈరోజు కూడా పెరిగింది. గత కొద్దిరోజులుగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. స్పీడ్‌కు బ్రేకులు పడడం లేదు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.320 పెరగగా.. కిలో వెండిపై రూ.1,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: PM Modi: ఢిల్లీ కేథడ్రల్ చర్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మోడీ.. ఎక్స్‌లో ఫొటోలు పోస్ట్
బులియన్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.320 పెరిగి.. రూ.1,39,250 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 300 పెరిగి రూ.1,27,650 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.240 పెరిగి రూ.1,04,400 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Nitin Gadkari: హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్య మిస్టరీపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఈరోజు కూడా సిల్వర్ ధర బిగ్ షాకిచ్చింది. నిన్న కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. ఈరోజు కిలో వెండిపై రూ.1,000 పెరిగింది. దీంతో సరికొత్త రికార్డ్ స్థాయిలో ధర దూసుకుపోతుంది. బులియన్ మార్కెట్లో ఈరోజు కిలో వెండి ధర రూ.2,34, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నై బులియన్ మార్కెట్లో మాత్రం రూ.2,45,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,34, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.