Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర

  • హడలెత్తిస్తున్న బంగారం, వెండి ధరలు
  • రూ.2 లక్షలు దాటేసిన వెండి ధర
  • బెంబేలెత్తిపోతున్న కొనుగోలుదారులు
Silver

Silver

మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మళ్లీ పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులే ఉన్నప్పటికీ బంగారం ధరలు మాత్రం దిగి రావడం లేదు. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 710 పెరగగా.. కిలో సిల్వర్ రూ.3,000 పెరిగింది. దీంతో రూ.2 లక్షల మార్కు దాటేసింది.

ఇది కూడా చదవండి: Gaza: గాజాలో పెళ్లి సందడి.. పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు

×
×
Ad

బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.710 పెరిగి రూ.1,30,580 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 650 పెరిగి రూ.1,19,700 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.530 పెరిగి రూ.97,940 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Shah Rukh Khan: షారూఖ్‌ఖాన్ మార్కుల షీట్ వైరల్.. మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులొచ్చాయంటే..!

ఇక వెండి ధర భారీ షాకిచ్చింది. కిలో వెండి 2లక్షల మార్కు దాటేసింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,91, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.2,01,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,91, 000 దగ్గర అమ్ముడవుతోంది.