Gold Rates: దేశవ్యాప్తంగా బంగారం కొనాలని భావించేవారికి శుభవార్త అందింది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేర దిగి వచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం రూ.46,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.660 తగ్గింది. ప్రస్తుతం రూ.50,290గా ఉంది. కానీ వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండిపై రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.64,400గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉండే అవకాశం ఉంది.
Read Also: Beauty Tips : చలికాలంలో చర్మ సంరక్షణకు హోంమేడ్ ఫేస్ ప్యాక్స్
కాగా ధంతేరాస్, దీపావళి పండగ సీజన్ అయిపోయిన తర్వాత బంగారం ధరలు ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి అని బిజినెస్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడమే బంగారం ధరలు భారీగా పడిపోవడానికి కారణమని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వెడ్డింగ్ సీజన్ ఉండటంతో.. గోల్డ్ డిమాండ్ ప్రీ కరోనా స్థాయిలకు వచ్చేసింది. డిసెంబర్ వరకు బంగారానికి హై డిమాండ్ ఉంటుందని వర్తకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా తగ్గిన బంగారం ధర డిమాండ్ మరింత పెరిగేందుకు సహకరిస్తుందని పేర్కొన్నారు.