ధరలు పెరిగినా తగ్గినా వాటితో సంబంధం లేకుండా కొనేవారు కొంటూనే ఉంటారు.. భారత్ మార్కెట్‌లో ఎప్పుడూ బంగారానికి మంచి గిరాకీ ఉంటుంది.. అయితే, ఇవాళ కూడా పసిడి ధరలు కాస్త దిగివచ్చి గుడ్‌న్యూస్ చెప్పాయి.. ఈ రోజు ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా మరియు ముంబైలలో బంగారం ధరలు దిగివచ్చాయి.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పతనంతో 46,650కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 పతనంతో రూ. 50,890కు క్షీణించాయి.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 తగ్గడంతో రూ. 46,770కి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70 తగ్గడంతో రూ.51,020కి చేరాయి…
Read Also: breaking: సీపీఎం కార్యాలయంపై బాంబుల దాడి.. కేరళలో టెన్షన్, టెన్షన్..!
ఇక, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,650గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,890గా ఉండగా.. రూ.100 తగ్గడంతో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,650కి, రూ.110 తగ్గి 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,890 పతనమైంది.. మరోవైపు, కోల్‌కతా, ఢిల్లీ మరియు ముంబైలలో కిలో వెండి ధర రూ. 59,000గా, చెన్నైలో వెండి ధర రూ. 65,100గా ఉంది. మరోవైపు, హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో ఈరోజు బంగారం ధరలు పరిశీలిస్తే.. బెంగళూరులో రూ.100 తగ్గడంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,650కి పతనం కాగా.. రూ. 110 క్షీణించడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,890కి పడిపోయింది.. హైదరాబాద్‌లో రూ.100 తగ్గి 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 46,650కి చేరగా.. రూ.110 తగ్గడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,890 పతనమైంది.. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,650గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,890గా ఉంది.. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,650గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,890కి క్షీణించింది.. ఇక, హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 65,100గా ఉంది.