శుక్రవారం భారీగా పెరిగి ధరలు శనివారం మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయని తెలిసిన విషయమే. ఈ నేపథ్యం బంగారం ధరలు కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.230 వరకు ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 47,450 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,760 వద్ద కొనసాగుతున్నాయి. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.