Gold Rates: యుద్ధం వేళ బంగారం, వెండి ధరలు ఇలా..!

  • మధ్యప్రాచ్యంలో భీకరమైన యుద్ధం
  • యుద్ధం వేళ శాంతించిన బంగారం, వెండి ధరలు
  • కొనుగోలుదారుల్లో ఆసక్తి
Gold

Gold

మధ్యప్రాచ్యంలో భీకరమైన యుద్ధంతో అట్టుడుకుతోంది. దీంతో ప్రపంచ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అన్ని వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. చమురు, గ్యాస్ ధరలపై తీవ్ర ప్రభావం పడవచ్చన్న సంకేతాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మాత్రం కాస్త శాంతించాయి. యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి కూడా అంతగా ప్రభావం చూపించలేదు. పెళ్లిళ్ల సీజన్‌లో ఇది కాస్త ఉపశమనంగానే చెప్పొ్చ్చు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.770 తగ్గగా.. వెండి ధర మాత్రం యథాతథంగా ఉంది.

ఇది కూడా చదవండి: SSC Maths Study Tips: టెన్త్ పరీక్షలకు రెడీనా? మ్యాథ్స్ టెన్షన్ తగ్గించే సూపర్ స్టడీ టిప్స్ మీ కోసం..

తులం గోల్డ్‌పై రూ.770 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,62,110 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.700 తగ్గడంతో రూ.1,48,600 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.580 తగ్గడంతో రూ.1,21,880 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Vijay: పెళ్లిలో త్రిషతో కలిసి విజయ్ సందడి.. వీడియో వైరల్

ఈరోజు సిల్వర్ ధర భారీ ఊరట కలిగించింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధరపై రూ.2,85, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,90,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ.2,85, 000 దగ్గర అమ్ముడవుతోంది.