పండుగల సీజన్ వచ్చిందంటే ప్రత్యేక సేల్, రిపబ్లిక్ డే వచ్చేస్తోంది అంటే స్పెషల్ డిస్కౌంట్లు, గణతంత్ర దినోవ్సవానికి ప్రత్యేక ఆఫర్లు.. ఇలా సందర్భం ఏదైనా.. ఈ కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాయి.. ఇక, కరోనా విజృంభణతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడం, కర్ఫ్యూలు అమలు చేయడం లాంటి కఠిన నిర్ణయాలతో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితం అయ్యారు.. వర్క్ ఫ్రమ్ హోంలో చాలా మంది ఉన్నారు.. ఇక, కరోనా ఎఫెక్ట్‌తో.. అంతా ఆన్ లైన్ మయం అయిపోయింది.. జూమ్‌లో మీటింగ్‌లు, ఆన్‌లైన్ క్లాసులు లాంటి వాటితో.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. ప్రత్యేక సేల్ తీసుకొచ్చింది.. షాప్ ఫ్రమ్ హోమ్ డేస్ సేల్ పేరుతో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.. అంటే.. ఇవాళ రాత్రి 12 గంటలకే సేల్ ప్రారంభించనుంది ఫ్లిప్‌కార్ట్..
ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై భారీ డిస్కౌంట్లు ఉండగా.. ఇదే సమయంలో 10 శాతం ఇన్‌స్టాండ్ డిస్కౌంట్ కూడా లభించనుంది.. ఇక, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రిడెట్ కార్డుపై కొనుగులో చేస్తే అదనంగా మరో 10 శాతం ధర తగ్గిపోనుంది.. ఆర్‌వోజీ ఫోన్ 3 మోడల్‌లో 8+128 జీబీ వేరియంట్‌పై కస్టమర్లు రూ.5000 వేలు డిస్కౌంట్ పొందే అవకాశం ఉండగా.. 12 + 128 జీబీ వేరియంట్‌పై రూ. 4,000 తగ్గింపు ఉంటుంది. వీటికి ఇన్‌స్టాండ్ డిస్కౌంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై లభించే డిస్కౌంట్ అదనం.. కాగా, ఆనుస్ గత ఏడాది ROG ఫోన్ 3ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6.59 అంగుళాల డిస్‌ప్లేతో 2340×1080 పిక్సల్ రిజల్యూషన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865 ప్లస్ 5 జి ప్రాసెసర్‌తో 12 జీబీ వరకు ర్యామ్, 128 జీవీ వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఉంది.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 13 ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు 5 ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక, ముందు భాగంలో 24 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 10 లో పనిచేస్తుండగా.. 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని పొందుపర్చారు. ఇక, అనేక రకాల మొబైల్, టాబ్లెట్, స్మార్ట్‌వాచ్, స్మార్ట్‌టీవీ, రిఫ్రిజిరేటర్, దుస్తులు, బూట్లు, కిరాణా సామాను, ఫర్నిచర్, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి.