Flipkart: రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart: ప్రఖ్యాత ఇ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ రేపటి నుంచి బిగ్ దసరా సేల్ ప్రారంభించనుంది. ఈ కొత్త సేల్‌లో భాగంగా కస్టమర్లు పలు రకాల ప్రొడక్టులపై ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. నాయిస్ బ్రాండ్ ప్రొడక్టులపై భారీ తగ్గింపు లభిస్తుంది. స్మార్ట్ వాచ్‌లపై, ఇయర్ బడ్స్‌పై 70 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే పోకో ఫోన్లపై 45 శాతం తగ్గింపు అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట ప్లస్ మెంబర్లకు ఈ సేల్ 24 గంటల ముందు నుంచే ఉంటుంది. అక్టోబర్ 8 వరకు బిగ్ దసరా సేల్ అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు.
దసరా, దీపావళి ఇవి వరుస వెంట వచ్చే ముఖ్యమైన పండుగలు. అంతేకాదు, ఎక్కువ మంది ఈ సమయంలోనే తమకు కావాల్సిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. దీంతో డిమాండ్ కు తగ్గట్టు ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పోటా పోటీగా పండుగల ప్రత్యేక విక్రయ కార్యక్రమాలను చేపడుతున్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ పూర్తయిన ఐదు రోజులకే ఫ్లిప్ కార్ట్.. బిగ్ దసరా సేల్ పేరుతో మరో విడత ఆఫర్లతో కూడిన విక్రయాలను నిర్వహిస్తోంది.
Also Read
- Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
- EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
- RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
Read Also: Price Down: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన నిత్యావసరాల ధరలు
ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు బిగ్ దసరా సేల్ విక్రయాలు మంగళవారం ప్రారంభం కాగా, మిగిలిన అందరికీ ఈ నెల 5 నుంచి బిగ్ దసరా సేల్ మొదలు కానుంది. ఈ నెల 8వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డులతో చెల్లింపులు చేస్తే 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా ఇస్తోంది. టీవీలపై కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఏకంగా 75 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీల ధర రూ. 7,199 నుంచి ప్రారంభం అవుతోంది. ఇంకా వాషింగ్ మెషీన్ల ధర రూ. 6,990 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రిజ్‌లపై కూడా డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఏసీలపై, వాసింగ్ మెషీన్లపై 55 శాతం తగ్గింపు పొందొచ్చు.
ల్యాప్ టాప్స్ కొనుగోలు చేసే వారిపై కూడా ఆఫర్లు ఉన్నాయి. 50 శాతం వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఇంకా క్రేజీ డీల్స్, రష్ అవర్స్, టైమ్ బాండ్ డీల్స్ వంటివి కూడా ఉంటాయి. వీటి ద్వారా అదనపు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. బై మోర్ సేవ్ మోర్ ఆఫర్ కూడా ఉంది. మూడు కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతంగా తగ్గింపు వస్తుంది. కొన్నింటిపై రెండు ప్రొడక్టులు కొన్నా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అదే ఐదు ప్రొడక్టులు కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
- Tags
- Amazon
- Dussehra
- E commerce
- Flipkart
- Sale
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!