ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో చాలా మంది ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. అయితే ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌లో కీలకమార్పులు జరగబోతున్నాయి. బ్లూరంగులో కనిపించే ఫేస్‌బుక్ టికర్ ఇకపై కనిపించదు. దాని స్థానంలో మెటా టికర్, లోగోను త్వరలో తీసుకురాబోతున్నామని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఆ టికర్‌తోనే ట్రేడింగ్ చేస్తామని అమెరికా స్టాక్‌మార్కెట్ నాస్‌డాక్‌కు తెలిపారు.
2004లో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్‌ను ప్రారంభించగా 2012లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన టికర్, లోగోనూ రూపొందించారు. ఫేస్‌బుక్‌తో ప్రయాణం ప్రారంభించిన జుకర్‌బర్గ్ అనంతరం వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను సొంతం చేసుకుని ప్రపంచంలోనే అతి పెద్ద సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌గా ఫేస్‌బుక్‌ను తీర్చిదిద్దారు. అయితే టెక్నాలజీ సాయంతో మెటావర్స్‌పై నమ్మకం పెట్టుకున్న జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ కంపెనీ పేరు కూడా మెటా అని 2021 అక్టోబరులో మార్చేశారు. అయితే ఇప్పటికే కోట్లాది మంది ప్రజలకు చేరువైన ఫేస్‌బుక్ టికర్, లోగోలను ఇప్పుడు మార్చితే ఏమవుతుందనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టికర్ మార్పు ప్రకటన అనంతరం మెటా షేర్ల విలువకు 6 శాతం మేర కోత పడింది. మరి జుకర్‌బర్గ్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గుతారేమో వేచి చూడాలి.