NTV Telugu Site icon

EPFO ELI Scheme: మీకు పీఎఫ్ ఖాతా ఉందా?.. వెంటనే ఈ పని చేయండి.. లేకపోతే నష్టపోతారు?

Pf

Pf

సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులందరికీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. ఆయా కంపెనీలు ఉద్యోగి పేరిట పీఎఫ్ అకౌంట్ ను ఓపెన్ చేస్తాయి. ఇందులో ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం జమ చేస్తారు. కాగా తాజాగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురును అందించింది. వెంటనే ఆ పనిచేయాలని కోరింది. లేకపోతే మీరు ఉచితంగా ఒక నెల శాలరీని కోల్పోయే అవకాశం ఉంటుంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ చేయడానికి, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పొడిగించింది.

Also Read:IND vs PAK: పాకిస్తాన్ ఓటమి.. మీమ్స్‌తో నెటిజన్లు రచ్చ

కాబట్టి UAN ని యాక్టివేట్ చేయని, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయని సభ్యులకు భారీ ఊరట లభించినట్లైంది. UAN యాక్టివ్‌గా లేని, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయని సభ్యులు ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇనిషియేటివ్ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందలేరు. ELI పథకం ప్రయోజనాన్ని పొందడానికి, సభ్యులు UAN ని యాక్టివేట్ చేసుకోవడం, బ్యాంక్ ఖాతాను ఆధార్ తో లింక్ చేయడం తప్పనిసరి. యూఏఎన్ యాక్టివేషన్ గడువును మార్చి 15, 2025 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

Also Read:Pedakakani: పెదకాకానిలో విషాదం.. గోశాల దగ్గర కరెంట్‌ షాక్‌తో నలుగురు మృతి..!

కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ప్రోత్సాహాలు కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ELI) తీసుకొచ్చింది. దీని ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల జీతం ప్రోత్సాహకంగా అందిస్తారు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయడానికి, EPFO ​మెంబర్ పోర్టల్‌ని సందర్శించి అవసరమైన వివరాలను నమోదు చేసి యాక్టివేట్ చేసుకోవచ్చు.