LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
- కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు
- 19 కేజీల సిలిండర్‌పై రూ.9.50 పెరుగుదల
- 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మార్పు లేదు
- సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Cylinder: సెప్టెంబర్ 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. నెల ప్రారంభంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.9.50 చొప్పున ధర పెంచాయి. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలు, బేకరీలు, స్వీట్ షాపులు, ఇతర వాణిజ్య సంస్థలపై ఇంధన వ్యయం కొంత మేర పెరగనుంది. కొత్త ధరల ప్రకారం.. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.2,738 నుంచి రూ.2,747.50కి పెరిగింది. చెన్నైలో రూ.2,906గా ఉన్న ధర తాజాగా రూ.2,916.50కి చేరింది. ఇతర నగరాల్లో స్థానిక పన్నులు, ఇతర ఛార్జీల ఆధారంగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చని చెబుతున్నారు. కమర్షియల్ ఎల్పీజీ ధరలు పెరిగినప్పటికీ.. సాధారణ గృహ వినియోగదారులకు మాత్రం ఊరట లభించింది. 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలో సెప్టెంబర్ 1 నుంచి ఎలాంటి మార్పు లేదు. తాజా ధర పెరుగుదల కేవలం వాణిజ్య సిలిండర్లకే వర్తిస్తుంది. దీంతో ఇళ్లలో వంట కోసం గ్యాస్ ఉపయోగించే వినియోగదారులపై తక్షణంగా అదనపు భారం పడలేదు.
వ్యాపారాలపై ఎంత ప్రభావం ఎంతంటే..
ఒక్కో సిలిండర్‌పై రూ.9.50 పెంపు పెద్ద మొత్తంగా కనిపించకపోయినా.. రోజుకు పలు సిలిండర్లు వాడే వ్యాపార సంస్థలకు నెలవారీగా అదనపు ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాలు, బేకరీలు, స్వీట్ షాపులు వంటి సంస్థలు కమర్షియల్ ఎల్పీజీపై ఎక్కువగా ఆధారపడతాయి. ఇంధన ఖర్చులు పెరిగితే భవిష్యత్‌లో ఆహారం, ఇతర సేవల ధరలపై కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. నిజానికి 2026లో వాణిజ్య ఎల్పీజీ ధరల్లో పలుమార్లు ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగస్టులో కమర్షియల్ సిలిండర్ల ధరలు గణనీయంగా తగ్గగా.. అంతకుముందు జూలైలోనూ ధర తగ్గింపు నమోదైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో తాజాగా రూ.9.50 పెంపు జరిగింది. గత తగ్గింపులతో పోలిస్తే ఈసారి పెరుగుదల స్వల్పంగానే ఉన్నప్పటికీ.. వాణిజ్య వినియోగదారులపై అదనపు వ్యయభారం పడనుంది.
Also Read
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
- Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
- Bank Holidays: రాబోయే 2 నెలల్లో 33 రోజులు బ్యాంకులు బంద్! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
- RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సమీక్షిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు, విదేశీ మారకపు విలువ, ఇతర వ్యయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ధరల్లో మార్పులు చేస్తాయి. అందుకే సిలిండర్ బుక్ చేసుకునే ముందు తమ నగరానికి వర్తించే తాజా ధరను వినియోగదారులు, వ్యాపార సంస్థలు పరిశీలించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్ 1 నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్వల్పంగా పెరగగా.. గృహ వినియోగ ఎల్పీజీ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు ఊరటనిచ్చింది.
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!