వ్యాపారం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ సంపద సృష్టించాలన్నా, పది మందికి ఉపాధి కల్పించాలన్నా, స్వయంగా ఉపాధి పొందాలన్నా వ్యాపారం చేయడమే బెటర్ అంటున్నారు నిపుణులు. తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు పొందేందుకు అనేక మార్గాలున్నాయి. పేపర్ ప్లేట్స్, కొవ్వొత్తుల తయారీ, టైలరింగ్, ఇలా రకరకాల వ్యాపారాలను చేయొచ్చు. అయితే మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి మంచి లాభాలు అందుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ ఉంది. అదే ఉడికించిన కోడి గుడ్ల వ్యాపారం. ఈ బిజినెస్ తో డబుల్ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఉడికించిన కోడి గుడ్లతో వ్యాపారం ప్రారంభిస్తే కళ్లు చెదిరే లాభాలు అందుకోవచ్చు. సాధారణంగా మార్కెట్ లో కోడి గుడ్డ్ ధర రూ. 5 ఉందనుకుందాం. అప్పుడు మీరు 150 ఎగ్స్ కొనుగోలు చేస్తే రూ. 750 అవుతుంది. ఇలా కొనుగోలు చేసిన ఎగ్స్ ను బాయిల్డ్ చేసి రూ. 10 చొప్పును అమ్మినట్లైతే 150 బాయిల్డ్ ఎగ్స్ కు రూ. 1500 వస్తాయి. ఒక్కరోజులోనే మీరు రూ. 1500 సంపాదించుకోవచ్చు. 15 రోజుల్లో రూ. 22,500 ఆదాయం సమకూరుతుంది. నెల రోజుల్లో రోజుకు 150 బాయిల్డ్ ఎగ్స్ అమ్మినట్లైతే రూ. 45,000 సంపాదించుకోవచ్చు. ఉడికించిన కోడి గుడ్లతో వ్యాపారం చేస్తే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలను అందుకోవచ్చు.
Also Read:Tooth Brush: మీ టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడుతున్నారా..? ప్రమాదం పొంచి ఉన్నట్టే..
అయితే ఈ బిజినెస్ గ్రామాల్లో కంటే పట్టణాలు, నగరాల్లో నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రైవేట్ హాస్టల్స్ ఎక్కువగా ఉండే చోట, హోటల్స్, వైన్ షాప్స్ ఉన్న ప్రాంతాల్లో బాయిల్డ్ ఎగ్స్ ను అమ్ముకోవచ్చు. గుడ్లలో పోషకాలు మెండగా ఉంటాయన్న విషయం తెలిసిందే. గుడ్డులో దాదాపు 78 కేలరీలు ఉంటాయి. ఇందులో శరీరానికి అవసరమైన కొవ్వు, ప్రొటీన్లు, కొవ్వు, విటమిన్ డి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతి రోజు ఒక బాయిల్డ్ ఎగ్ ను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.