Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Byjus To Lay Off 500 Employees Amid Financial Crunch Report

Byju’s: 500 మంది ఉద్యోగులను తొలగించనున్న బైజూస్..

Published Date :April 2, 2024 , 8:45 pm
By BV Reddy
Byju’s: 500 మంది ఉద్యోగులను తొలగించనున్న బైజూస్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Byju’s: ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ తొలగింపు ప్రక్రియ 15-20 రోజుల క్రితమే ప్రారంభమైందని తెలుస్తోంది. దాదాపుగా 500 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండనుంది. తాజాగా ఉద్యోగాల కోత సేల్స్ ఫంక్షన్స్, టీచర్లు, ట్యూషన్ సెంటర్లపై ప్రభావం చూపుతోంది. అయితే, అధికారికంగా బైజూన్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కొంతమంది సిబ్బందికి ఫోన్ల ద్వారా తాజా పరిణామాల గురించి తెలియజేశారు.

అక్టోబర్ 2023లో ప్రకటించిన బిజినెస్ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా మెరుగైన నగదు ప్రవాహ నిర్వహణ, ఆపరేటింగ్ స్ట్రక్చరింగ్, ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో చివరి దశలో ఉన్నామని బైజూస్ ప్రతినిధి చెబుతున్నారు. నలుగురు విదేశీ పెట్టుబడిదారులతో కొనసాగుతున్న వ్యాజ్యం కారణంగా కంపెనీ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటుందని, ఇక్కడ ప్రతీ ఉద్యోగి, ఎకో సిస్టమ్ తీవ్రంగా ఒత్తిడికి గురవుతోందని చెప్పారు.

Read Also: Zomato: జొమాటోకు జీఎస్టీ భారీ షాక్.. నోటీసులో ఏముందంటే..!

వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా దాదాపుగా 4500 మందిపై ప్రభావం చూపుతుందని ఇంతకుముందు బైజూస్ చెప్పింది. ఆ తర్వాత 2023 అక్టోబర్-నవంబర్‌లో 2500-3000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పటి వరకు 3000-3500 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని అనుకుంటే, మరో 1000-1500 మందిని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్చి వేతనాల పంపిణీలో జాప్యం ఏర్పడుతుందని ఇటీవల కంపెనీ తన ఉద్యోగులకు చెప్పింది.

బైజూస్ సీఈఓ రవీంద్రన్‌తో సహా సహవ్యవస్థాపకులను తొలగించి, కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. పెట్టుబడిదారుల సమూహం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు పిటిషన్ దాఖలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఓ వెలుగు వెలిగిన బైజూస్, తర్వాత ఫిజికల్ క్లాసులు ప్రారంభం కావడం, ఆకాష్ కొనుగోలు చేయడంతో కంపెనీ ఆర్థిక ఇబ్బందులకు గురైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Business
  • Byju's
  • byjus layoff
  • layoff news
  • Tech layoff

తాజావార్తలు

  • Anushka Sharma-Tollywood: అనుష్క శర్మ టాలీవుడ్ ఎంట్రీ.. కట్ చేస్తే.. !

  • Toyota Land Cruiser FJ: టయోటా అత్యంత చౌకైన ల్యాండ్ క్రూయిజర్ FJ విడుదల.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే?

  • Supreme Court: మతం మారితే ఎస్సీ హక్కులు వర్తించవు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

  • Rinku Singh: రింకు సింగ్‌కు కీలక పదవి.. ఆనందంలో ఫాన్స్!

  • Harish Shankar: హరీష్ శంకర్.. నెక్స్ట్ ఏంటి?, ‘ఉస్తాద్’ పరిస్థితేంటి?

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions