Wipro Buyback: విప్రో ఇన్వెస్టర్లకు కాసుల పండగే.. రూ.15 వేల కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన ఐటీ దిగ్గజం
- రూ.210 విలువైన షేరుకు రూ.250 ఆఫర్
- మొత్తం 600 మిలియన్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయనున్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wipro Buyback: స్టాక్ మార్కెట్‌లో నిత్యం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న విప్రో ఇన్వెస్టర్లకు కంపెనీ ఒక పెద్ద ఊరట కలిగించే వార్తను చెప్పింది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఈ ఐటీ దిగ్గజం రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. మీ పోర్ట్‌ఫోలియోలో విప్రో షేర్లు ఉన్నట్లయితే మీకు కాసుల పంటపండటం ఖాయం. ఈ బైబ్యాక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
READ ALSO: Yuvraj Singh: అభిషేక్ శర్మతో పాటు.. అతడు కూడా యువరాజ్ సింగ్ శిష్యుడే.. ఓపెనింగ్‌లో దబిడిదిబిడే..
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
- RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
ఒక్కో షేరు ధర ఎంతంటే..
ఈ బైబ్యాక్ కోసం కంపెనీ ఒక్కో షేరుకు రూ.250 ధరను నిర్ణయించింది. గురువారం షేరు ముగింపు ధర (రూ.210.15)తో పోలిస్తే, విప్రో తన పెట్టుబడిదారులకు సుమారు 19% ప్రీమియంను అందిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ప్రస్తుత మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు మీ షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి కంపెనీ రెడీగా ఉంది. ఈ మొత్తం ప్రక్రియ టెండర్ ఆఫర్ మార్గం ద్వారా జరగనుంది. కంపెనీ ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 600 మిలియన్ల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఇది కంపెనీ మొత్తం చెల్లించిన ఈక్విటీలో 5.7 శాతానికి సమానం. ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అస్థిర వాతావరణంలో లాభదాయకమైన ఎగ్జిట్ కోసం చూస్తున్న ఇన్వెటర్లకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ బైబ్యాక్‌లో అత్యంత ఆసక్తికరమైన, గమనించదగ్గ అంశం ప్రమోటర్ల వాటాకు సంబంధించినది. విప్రో ప్రమోటర్లు (కంపెనీలో 72.6% వాటాను కలిగి ఉన్నవారు) కూడా తమ షేర్లను టెండర్ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విప్రో స్టాక్ 20% కంటే ఎక్కువగా పడిపోయింది. దీర్ఘకాలంలో అంటే గత ఐదేళ్లలో కూడా, ఇది పెట్టుబడిదారులకు 10.42% ప్రతికూల రాబడిని అందించిందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ గతంలో జూన్ 2023లో రూ.12,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను నిర్వహించింది. ప్రస్తుతం రూ.2.20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న విప్రోకు, ఈ బైబ్యాక్ కేవలం షేర్లను కొనుగోలు చేసే ప్రక్రియ మాత్రమే కాదు, పడిపోతున్న తన స్టాక్‌ను నిలబెట్టుకోవడానికి, అసంతృప్తిగా ఉన్న పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవడానికి ఇది ఒక కీలక చర్యగా చూస్తుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!