మీరు ఏదైనా బిజినెస్ చేసి డబ్బులను సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మీకో బెస్ట్ ఐడియా ఉంది.. ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వడం వలన లాభాలే లాభాలు. ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరూ కూడా ఫుడ్ ని ఆర్డర్ చేసుకుంటున్నారు.. ముఖ్యంగా చాలా ఎక్కువగా బిర్యానిని ఆర్డర్ చేసుకుంటున్నారు.. బిరియానిని ఏ టైంలో అయిన తినడానికి ఇష్టపడతారు.. ముఖ్యంగా నైట్ టైం బిరియానికి మంచి డిమాండ్ ఉంటుంది.. దీన్ని మీరే సొంతంగా వండి సేల్ చెయ్యొచ్చు.. ఒక్కసారి క్లిక్ అయితే మీకు లాభాలే లాభాలు..
మీరు చిన్న పాయింట్ లాగా పెడితే ఎటువంటి పర్మిషన్స్ అవసరం ఉండదు కానీ మీరు రెస్టారెంట్ లాగా పెడితే మాత్రం ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.. లైసెన్స్ ను తీసుకోవాలి.. బిర్యానీ పాయింట్ ని స్టార్ట్ చేసి చక్కగా లాభాలని పొందొచ్చు. అయితే ఈ బిజినెస్ ని మొదలు పెట్టడానికి మొదట మీరు టేస్ట్ నాణ్యత బాగా మెయింటైన్ చేయాలని గుర్తుపెట్టుకోండి. మీ బిర్యాని కనుక బాగా పాపులర్ అయితే ఇక మీ వ్యాపారంలో తిరుగే ఉండదు.. టేస్ట్ మీదే మీ లాభాలు ఉంటాయి..
మీరు డిఫరెంట్ గా ఆలోచిస్తున్న వారైతే మంచి పేరును కూడా పెట్టండి.. అదే బ్రాండ్ తో పాయింట్ ను మొదలు పెట్టవచ్చు.. బిర్యాని ని తయారు చేసేందుకు సామాన్లు కొనుగోలు చేసి మీరు స్టార్ట్ చేయొచ్చు. కావాలంటే మీరు అవుట్ట్స్ లైని కూడా ప్రారంభించవచ్చు.. రకరకాల బిర్యానీ లను అమ్మడం వల్ల మరింత లాభాలను పొందుతారు..ఆన్లైన్ ద్వారా కూడా మీరు విక్రయించొచ్చు కావాలంటే మీరు రకరకాల బిర్యానీలు అమ్మొచ్చు.. ఇలా చేస్తే ఇంకా మంచి లాభాలను పొందవచ్చు..