బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా ఉంది.. ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియా మీ జీవితాన్ని మార్చేయవచ్చు.. ఈ బిజినెస్ ఏంటో కాదు టెంట్ హౌస్..ఈ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వాలు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో అంతగా ఇబ్బంది ఉండకపోవచ్చు.. మార్కెట్ లో పేరు పాపులర్ అయ్యే కొద్ది లాభాలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ బిజినెస్ గురించి ఇప్పుడే వివరంగా తెలుసుకుందాం..
వేడుకలు, పెళ్లిళ్లు, మరే ఇతర కార్యక్రమాలు జరిగినా బంధువులు, సన్నిహితులతో ఇళ్లు నిండిపోతుంది. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి టెంట్స్, ఫ్యాన్స్, లైట్లు, కుర్చీలు వంటి వస్తువులు అవసరం. వేడుకను బట్టి ఒకటి లేదా రెండు రోజులకు వాటిని టెంట్ హౌస్ వద్ద అద్దెకు తీసుకుంటారు. ఇక పార్టీలు, సభలు, సమావేశాలు ఎల్లప్పుడు జరుగుతుంటాయి. వాటికి అవసరమైన సామాన్లను అద్దెకు తీసుకుంటారు.. ఈ బిజినెస్ కు ఎప్పుడూ డిమాండ్ ఉండనే ఉంటుంది..
ముఖ్యమైన పట్టణాల్లో వీటికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది.. అందుకే పట్టణాలకు దగ్గరగా ఉండేటట్లు చూడటం బెస్ట్.. ఇక టెంట్ హౌస్ బిజినెస్‌లో డెకరేషన్ ఐటెమ్స్, లైట్స్, ఫ్యాన్లు, షామియానాలు, డైనింగ్, వంట, వడ్డించే పాత్రలు, టేబుల్స్, కుర్చీలు, చెక్క కర్రలు, ఇనుప కడ్డీలు, తివాచీలు, కర్టెన్స్, మ్యూజిక్ సిస్టమ్ వంటి సామాన్లు కీలకం. మీరు ఈ బిజినెస్ ప్రారంభించాలనుకుంటే వీటిని తప్పనిసరిగా కొనాల్సి ఉంటుంది.. ఈ మెటీరియల్ ను దగ్గరలోని షాప్ లో కొనుగోలు చెయ్యొచ్చు.. అప్పుడే మీకు తక్కువ ధర పడుతుంది.. నెలవారీ వాయిదాలతో లోన్ తీసుకుని ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. వచ్చిన లాభాలతో లోన్ తిరిగి చెల్లించవచ్చు..
ఈ బిజినెస్ ప్రారంభించాలంటే కనీసం రూ.4 లక్షల పెట్టుబడి అవసరం. సొంత స్థలంలో 500 చదరపు అడుగుల షెడ్డు కోసం రూ.1,00,000 ఖర్చు అవుతుంది. మిగతా రూ.3,00,000 మూలధనంతో ఫ్యాన్స్, టేబుల్స్, సీట్లు, షామియానాలు, వంట పాత్రలు తదితర వస్తువులను కొనుగోలు చేయవచ్చు..బిజినెస్ ద్వారా పెట్టుబడి పోను ఏడాదికి రూ.1,50,000 వరకు ఆదాయం పొందవచ్చు. టెంట్ హౌస్ వస్తువుల నిల్వకు షెడ్ నిర్మించకుండా అద్దెకు తీసుకుంటే నిర్మాణ ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయి.. ఈ వ్యాపారంతో స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.. అంటే లాభాలే కానీ నష్టాలు లేవని చెప్పాలి..