టెలికం సంస్థల మధ్య అమాంతం తగ్గిపోయిన మొబైల్ టారిఫ్ ధరలు.. మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. గత ఏడాది చివర్లో దాదాపు అన్ని ప్రధాన టెలికం సంస్థలు అన్నీ టారిఫ్ ధరలు పెంచేసి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి.. కానీ, మరోసారి తన యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పేందుకు ప్రముఖ టెలికం సంస్థల భారీ ఎయిర్‌టెల్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది.. గత ఏడాదిలో మొబైల్ టారిఫ్ ధరల పెంపుతో భారతీ ఎయిర్‌టెల్‌కు మూడో త్రైమాసికంలో కలిసివచ్చింది.. మరోవైపు.. ఎయిర్‌టెల్‌లో గూగుల్ పెట్టుబడులు కూడా మరింత ఉపశమనం కలిగించాయట.. కానీ, డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం 3 శాతం అంటే.. రూ. 854 కోట్ల నుంచి రూ. 830 కోట్లకు పడిపోయినట్టు ఆ సంస్థ పేర్కొంది.. అయితే మరో సారి టారిఫ్ పెంచేందుకు ఎయిర్‌టెల్ సిద్ధం అవుతోంది… 3 లేదా 4 నెలల్లో గానీ.. లేదా ఈ ఏడాదిలో ఎప్పుడైనా మొబైల్ టారిఫ్ ధరుల పెంపు ఉండవచ్చునని ఆ సంస్థ మేనేజ్‌మెంట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.. 2022 ఏడాదిలో ఒక యూజర్ సగటు రాబడిని రూ. 200 తీసుకోవాలని కంపెనీ భావిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.. దీంతో మొబైల్ టారిఫ్ ధర త్వరలోనే పైకి కదిలే అవకాశం స్పష్టం కనిపిస్తోంది.
Read Also: Hijab Row: బెంగళూరులో నిరసనలపై 2 వారాల నిషేధం..
మేం 2022లో మరోసారి టారిఫ్ ధరలు పెంపును ఆశించవచ్చు… కానీ, మరో మూడు నుండి నాలుగు నెలల వరకు కాదు జరగదని.. ఆ నిర్ణయంపై ఇతర టెలికం సంస్థల నుంచి ఉండే పోటీపై కూడా ఆధారపడి ఉంటుందని ఎయిర్‌టెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ వెల్లడించారు.. టారిఫ్ పెరుగుదల యొక్క ప్రారంభ సంకేతాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని.. నాల్గో త్రైమాసికంలో మరింత వృద్ధి చెందుతుందని అంచనా వేశామని విట్టల్ చెప్పారు. ప్రధానంగా అధిక డీజిల్ ధరల కారణంగా గత కొన్ని నెలలుగా భారీగా పెరిగిన నెట్‌వర్క్ నిర్వహణ ఖర్చులను తగ్గించడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు కూడా ఆయన వెల్లడించారు.