Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anjali Sardana: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారం, కిరాణా సామగ్రి 10 నిమిషాల్లో ఇంటికి రావడం మనకు అలవాటైపోయింది. అయితే ఇప్పుడు అదే తరహాలో ‘ఇంటి పని’ కూడా నిమిషాల్లోనే పూర్తయ్యే రోజులు వచ్చేశాయి. ఈ వినూత్న ఆలోచనతో 23 ఏళ్ల అంజలి సర్దానా అనే యువతి అతి తక్కువ కాలంలోనే వేల కోట్ల రూపాయల కంపెనీకి అధినేత్రిగా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఏమిటీ ‘ప్రొంటో’ (Pronto) మేజిక్?
ఈ రోజుల్లో ఇండియాలో పని మనిషిని వెతుక్కోవడం అంటే ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. తెలిసిన వారు చెప్పడమో లేదా సెక్యూరిటీ గార్డులని అడగడమో చేయాలి. తీరా దొరికినా నమ్మకం ఉండదు, పైగా వారు ఎప్పుడు సెలవు పెడతారో తెలియదు. ఈ సమస్యకు పరిష్కారంగా అంజలి సర్దానా ‘ప్రొంటో’ అనే యాప్‌ను తీసుకువచ్చారు. క్విక్ కామర్స్ తరహాలోనే, ఈ యాప్ ద్వారా పని మనిషిని బుక్ చేసుకుంటే కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే హెల్పర్లు మీ ఇంటికి చేరుకుంటారు. ఇల్లు శుభ్రం చేయడం, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం లేదా వంటలో సహాయం వంటి పనులను ఈ యాప్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్‌లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్‌లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
- Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
ఏఐ (AI) తో అద్భుతాలు
ఈ స్టార్టప్ విజయం వెనుక అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా అల్గారిథమ్స్ ఉన్నాయి. ఏ ప్రాంతంలో ఏ సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉందో ఏఐ అంచనా వేస్తుంది. దీనివల్ల వర్కర్లు కస్టమర్ ఇంటికి వేగంగా చేరుకోగలుగుతున్నారు. వర్కర్ల రేటింగ్, కస్టమర్ల ప్రాధాన్యతలను బట్టి సేవలు మెరుగుపరచబడతాయి. విదేశాల్లో చదువుకుని, ఇన్వెస్ట్మెంట్ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో అంజలి 2025లో గురుగ్రామ్ వేదికగా ఈ సంస్థను స్టార్ట్ చేశారు. అయితే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన కొన్ని నెలల్లోనే ఈ కంపెనీ విలువ రూ.1700 కోట్ల ($200 Million) మార్కుకు చేరుకుంది. గతేడాది డిసెంబర్లో రోజుకు 3,000 బుకింగ్స్ ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 26,000 మార్కును దాటేసింది. తాజాగా ఈ సంస్థ సుమారు 20 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది.
సామాజిక బాధ్యత.. భద్రత..
కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా, గృహ కార్మికుల భద్రతకు కూడా అంజలి పెద్దపీట వేశారు. వర్కర్లకు శిక్షణ ఇవ్వడం, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడమే కాకుండా, మహిళా వర్కర్ల కోసం యాప్‌లో SOS ఫీచర్, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణను కూడా అందిస్తున్నారు. ఈ యాప్ గ్రాండ్ సక్సెస్ సాధిస్తున్నప్పటికీ, గిగ్ వర్కర్ల ప్రయోజనాలు, లాభదాయకతపై విశ్లేషకులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ డిస్కౌంట్లతో మార్కెట్‌ను ఆక్రమిస్తున్న ఈ కంపెనీలు, భవిష్యత్తులో నిలదొక్కుకుంటాయా అనేది చూడాలి. ఇప్పటికే అర్బన్ కంపెనీ వంటి దిగ్గజాలు కూడా ఈ ఇన్ స్టంట్ సర్వీస్ రంగంలో పోటీ పడుతున్నాయి. మొత్తానికి ఇంటి పనులను కూడా ‘క్విక్ కామర్స్’గా మార్చిన అంజలి సర్దానా.. నేటి యువ స్టార్టప్ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్‌లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!