ICICI Bank Accounts: ఐసీఐసీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్లపై కొత్త ఛార్జీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలపై కొత్త ఛార్జీలు డిసెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. నెలకు మూడుసార్లు ఉచితంగా నగదు జమ చేసుకోవచ్చు లేదా తీసుకోవచ్చు. అలాగే ఒక నెలలో డిపాజిట్లు లేదా విత్‌డ్రాల మొత్తం లక్ష రూపాయల వరకు ఉంటే ఎలాంటి రుసుము ఉండదు. అయితే, ఈ ఉచిత పరిమితి దాటితే మాత్రం రుసుములు పెరుగుతాయి. ఇంతకుముందు ప్రతి వెయ్యి రూపాయలకు రూ.3.50 ఉండే ఛార్జీని, ఇప్పుడు రూ.4లకు పెంచారు. లేదా కనీసం రూ.150లు చెల్లించాలి. ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. ఉదాహరణకు.. మీరు నెలలో రూ.1.01 లక్షలు లావాదేవీ చేస్తే రూ.150ల రుసుము కట్టాలి. ఒకవేళ రూ.1.38 లక్షలు అయితే రూ.152లు కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది రూ.150 కన్నా ఎక్కువ కాబట్టి. ఇలా ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని వసూలు చేస్తారు. ఈ కొత్త ఛార్జీలు బ్యాంకు శాఖలలో చేసే నగదు లావాదేవీలకు, క్యాష్ రీసైక్లర్ యంత్రాల ద్వారా చేసే నగదు డిపాజిట్లకు వర్తిస్తాయి. అయితే పరిమితి దాటకుండా సాధారణంగా లావాదేవీలు చేసుకునేవారికి ఎలాంటి అదనపు భారం పడదు.
ఇక ఫిక్స్డ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. మూడు కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తాలపై బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. 7 రోజుల నుంచి 45 రోజుల కాలానికి సాధారణ పౌరులకు 2.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం వడ్డీ లభిస్తుంది. 46 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ పౌరులకు 4 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం వస్తుంది. 91 రోజుల నుంచి 184 రోజుల కాలానికి సాధారణ పౌరులకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం ఇస్తున్నారు. 185 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు కాలానికి సాధారణ పౌరులకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం వడ్డీ వస్తుంది.
Also Read
- SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
- SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
సంవత్సరం నుంచి 18 నెలల లోపు కాలానికి సాధారణ పౌరులకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వస్తుంది. 18 నెలల నుంచి 2 సంవత్సరాల కాలానికి సాధారణ పౌరులకు 6.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం వరకు వస్తుంది. 2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల కాలానికి సాధారణ పౌరులకు 6.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం వడ్డీ లభిస్తుంది. 3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల కాలానికి సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం గరిష్ట వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల కాలానికి సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం వడ్డీ ఇస్తున్నారు. 5 సంవత్సరాల టాక్స్ సేవర్ ఎఫ్డీలపై కూడా సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం చొప్పున గరిష్ట వడ్డీ లభిస్తుంది.
తాజావార్తలు
-
ICICI Bank Accounts: ఐసీఐసీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్లపై కొత్త ఛార్జీలు..
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
ట్రెండింగ్
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!