కేంద్రం ఈరోజు 2022-23 వ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై ప్రముఖులు స్పందిస్తున్నారు. బడ్జెట్‌పై తాజాగా వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అత్యంత ప్రభావవంతమైందని అన్నారు. తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగాన్ని ముగించడం పట్ల ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. సంక్షిప్తత ఎల్లప్పుడూ ఒక సుగుణం. నిర్మలా సీతారామన్ అతి తక్కువ సమయంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రభావవంతమైనదిగా మారవచ్చు అని పేర్కొన్నారు.
Read: ఆమె మామూలు మహిళ కాదు… భిక్షాటన చేస్తూ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
2020 లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రెండు గంటల 40 నిమిషాల వ్యవధిలో పూర్తి చేయగా, ఈసారి ప్రవేశపెట్టిన బడ్జెన్‌ను కేవలం గంటా 30 నిమిషాల్లోనే పూర్తిచేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాగైతే సంక్షిప్తంగా బడ్జెట్ ప్రసంగాన్నిముగించారో, ఆనంద్ మహీంద్రా కూడా బడ్జెట్‌పై సింపుల్‌గా ప్రభావవంతమైన బడ్జెట్ అని చెప్పడం విశేషం.