Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Layoffs in India: పండుగలకు ముందు తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఓవైపు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 ప్రారంభమైన సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 ఉద్యోగాలను తొలగించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ప్రభావం భారత్‌లోనూ కనిపించనుంది. నవరాత్రి, దీపావళి పండుగలకు ముందు దేశవ్యాప్తంగా రిటైల్ విభాగంలో సుమారు 1,000 మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి..
భారత్‌లో ఈ ఉద్యోగాల కోత ప్రధానంగా అమెజాన్ స్టోర్స్ విభాగంపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రధాన ఈ-కామర్స్ వెబ్సైట్ కార్యకలాపాలను పర్యవేక్షించే విభాగమే స్టోర్స్. సంస్థ తన నిర్మాణం, ప్రాధాన్యతలు, భవిష్యత్ అవసరాలను సమీక్షించిన తర్వాత కొన్ని ఉద్యోగాలను తొలగించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు పంపిన మెయిల్లో పేర్కొన్నట్లు నివేదికలు తెలిపాయి.
Also Read
- Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
- PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ఉద్యోగాలు కోల్పోయే వారికి అమెజాన్ పరిహారం
అయితే, ఉద్యోగాల నుంచి తొలగించబడిన వారికి పరిహార ప్యాకేజీని కూడా అమెజాన్ ప్రకటించినట్లు సమాచారం. ప్రస్తుత ఉద్యోగ స్థితిని బట్టి కొంతకాలం పూర్తి జీతం, ప్రయోజనాలతో కూడిన నాన్-వర్కింగ్ పీరియడ్‌ను అందించనున్నట్లు తెలిపింది. అలాగే దేశం, ఉద్యోగ స్థితిని బట్టి మారే విధంగా సెవెరెన్స్ ప్యాకేజీ, ట్రాన్సిషనల్ బెనిఫిట్స్ అందించనున్నట్లు ఉద్యోగులకు పంపిన మెయిల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది నుంచే కొనసాగుతున్న ఉద్యోగాల కోత
కాగా, అమెజాన్‌లో తాజా ఉద్యోగాల కోత ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదని నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది ప్రారంభమైన ఉద్యోగాల కోతలు ఈ ఏడాది జనవరి వరకు కొనసాగాయి. వివిధ విభాగాల్లో గత ఏడాది సుమారు 30,000 ఉద్యోగాలను అమెజాన్ తగ్గించినట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ తన వనరులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కార్యకలాపాల వైపు మళ్లిస్తోంది.
AI, ఆటోమేషన్‌పై అమెజాన్ భారీ దృష్టి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టెక్నాలజీ, ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు అమెజాన్ ప్రయత్నిస్తోంది. ఈ మార్పులో భాగంగా భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇక, భవిష్యత్ అవసరాల దృష్ట్యా డేటా సెంటర్ల నిర్మాణం కోసం గత ఏడాది 100 బిలియన్ డాలర్లకు పైగా కేటాయించినట్లు సమాచారం. ఈ డేటా సెంటర్లు సంస్థ అంతర్గత అవసరాలతో పాటు ఎంటర్ప్రైజ్ కస్టమర్లకు అవసరమైన AI మౌలిక వసతులను అందించేందుకు ఉపయోగపడనున్నాయి.
ఉద్యోగులకు Andy Jassy కీలక సూచనలు
2021లో జెఫ్ బెజోస్ తర్వాత అమెజాన్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఆండీ జెస్సీ కూడా సంస్థ AI ప్రయాణంపై ఉద్యోగులకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. AI మార్పును స్వీకరించి, దాని గురించి అవగాహన పెంచుకుని, సంస్థ అంతర్గత AI సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో భాగస్వాములయ్యే ఉద్యోగులకు భవిష్యత్తులో అధిక ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. AIని సంస్థవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించడం వల్ల సామర్థ్యం పెరుగుతుందని, దాని ఫలితంగా మొత్తం కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని కూడా జెస్సీ గతంలో వెల్లడించారు. ఆయన నాయకత్వంలోనే 2022–23 మధ్య అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతలు జరిగాయి. ఆ సమయంలో సుమారు 27,000 కార్పొరేట్ ఉద్యోగాలు తగ్గించినట్లు సమాచారం. ఇక, తాజా ఉద్యోగాల కోతతో పండుగ సీజన్‌కు ముందు అమెజాన్‌లో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. AI, ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీల వైపు కంపెనీ వేగంగా మారుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాలపై ఈ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!