Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Ai Boom Amazon Google Meta Microsoft Invest 650 Billion Bigger Than Indias Budget

AI: దిగ్గజ కంపెనీల AI పెట్టుబడులు.. ఏకంగా భారత్ బడ్జెట్‌కు సమానం..

Published Date :February 6, 2026 , 6:46 pm
By BV Reddy
  • ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న టెక్ కంపెనీలు..
  • అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ పెట్టుబడులు $650 బిలియన్లు..
  • భారత బడ్జెట్ ‌కు సమానంగా ఏఐ పెట్టుబడులు..
AI: దిగ్గజ కంపెనీల AI పెట్టుబడులు.. ఏకంగా భారత్ బడ్జెట్‌కు సమానం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AI: ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమ ఉద్యోగుల్ని తీసేసి, ఏఐపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఏకంగా భారత బడ్జెట్‌కు దాదాపుగా సమానమైన పెట్టుబడుల్ని కేవలం నాలుగు కంపెనీలే పెడుతున్నాయంటే ఏ రేంజ్‌లో ఏఐ బూమ్ ఉందో తెలుస్తోంది. ఏఐ, దాని అనుబంధ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ ఏకంగా 650 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని పెడుతున్నాయి. ఇటీవల, మన కేంద్ర బడ్జెట్ సుమారుగా 670 బిలియన్ డాలర్లు.

AIపై భారీ పెట్టుబడులు:

అయితే, టెక్ కంపెనీలు చెబుతున్న ఈ లెక్క కేవలం అంచనా మాత్రమే. దీని కన్నా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. దీనిని బట్టి చూస్తే భారత్ బడ్జెట్ కేటాయింపుల కన్నా ఏఐపై దిగ్గజ కంపెనీలు పెడుతున్న పెట్టుబడులు అధికం. అమెజాన్ $200 బిలియన్, గూగుల్ $175–185 బిలియన్లు, మెటా $115–135 బిలియన్లు, మైక్రోసాఫ్ట్ $115–135 బిలియన్లు ఖర్చు చేస్తామని ప్రకటించాయి. ఈ మొత్తం ఖర్చు ప్రధానంగా డేటా సెంటర్లు, సూపర్‌కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, AI చిప్‌లు, సర్వర్లు, క్లౌడ్ టెక్నాలజీల కోసం వినియోగించుతామని చెబుతున్నాయి.

ఏఐ రంగంలో గెలిచిన వారికే టెక్ రంగంలో ఆధిపత్యం. దీంతోనే అనేక కంపెనీలు ఏఐపై దృష్టిపెట్టాయి, భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాట్లాడుతూ.. ప్రతీ కస్టమర్ అనుభవం ఏఐతో ముడిపడి ఉందని, అందు కోసమే తాము అగ్రెసివ్‌గా పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు.

ఉద్యోగాలను తినేస్తున్న AI:

ఇదిలా ఉంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ఉద్యోగాలను తినేస్తోంది. ఏఐ వల్ల చాలా ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన ఆంథ్రోపిక్ సీఈఓ చేసిన వ్యాఖ్యలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లలో గుబులు పెంచుతున్నాయి. వచ్చే కొన్ని రోజుల్లో టెక్కీలను రీప్లేస్ చేసే ఏఐ మోడల్స్ వస్తాయని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకు అమెజాన్ 30,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. మైక్రోసాఫ్ట్ 9000 మందిని, మెటా తన రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో 10 శాతం సిబ్బందిని తగ్గించింది. ఏఐ వల్ల రాబోయే కాలంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల్ని తీసేసే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AI investment boom
  • Amazon AI investment
  • Artificial Intelligence
  • Google AI spending
  • Meta AI budget

తాజావార్తలు

  • Inorbit Mall: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. అక్కడ ఇనార్బిట్ మాల్ ప్రారంభం..

  • Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ

  • Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

  • STORY BOARD : అదే కథ… అదే కత్తి..! టాలీవుడ్ ఇంకా ఎంతకాలం రీపీట్ మోడ్‌లో.?

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions