Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Aha Decision Aha In Netflix Way To Increase Revenue

‘Aha’ Decision: ‘ఆహా’.. ఏం నిర్ణయం?. ఆదాయం కోసం నెట్‌ఫ్లిక్స్‌ రూట్‌లో పయనం

Published Date :August 17, 2022 , 11:23 am
By Akkirala Kondala Rao
‘Aha’ Decision: ‘ఆహా’.. ఏం నిర్ణయం?. ఆదాయం కోసం నెట్‌ఫ్లిక్స్‌ రూట్‌లో పయనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘Aha’ Decision: తెలుగు, తమిళ కంటెంట్‌ ప్రొవైడర్‌ అయిన ‘ఆహా’ ఓటీటీ.. ఆదాయం కోసం నెట్‌ఫ్లిక్స్‌ బాటలో పయనిస్తోంది. చిన్న పట్టణాల నుంచి కూడా సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడంతోపాటు యాడ్స్‌తో కూడిన వీడియోలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హైబ్రిడ్‌ మోడల్‌కి మారుతోంది. యాడ్స్‌లేని సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ కూడా తమ ప్లాట్‌ఫామ్‌పై ఉందని స్పష్టం చేసింది. దేశంలోని మెజారిటీ ఓటీటీలు సబ్‌స్క్రిప్షన్‌ రెవెన్యూ పైనే ఆధారపడుతుండటంతో లాభాలు ఆర్జించలేకపోతున్నాయి. ఫలితంగా ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ముందుగా నెట్‌ఫ్లిక్స్‌ ఈ బాటపడితే దాన్ని ఇప్పుడు ‘ఆహా’ అనుసరిస్తోంది.

అదానీ కొత్త డీల్‌

మన దేశంలోని అతిపెద్ద ఇన్‌ల్యాండ్‌ కంటెయినర్‌ డిపోల్లో ఒకటైన ICD తంబ్‌ని అదానీ లాజిస్టిక్స్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ 835 కోట్ల రూపాయలు. గుజరాత్‌లోని వాపి అనే ప్రాంతంలో ఉన్న ఈ డిపో ఇప్పటివరకు నవ్‌కార్‌ కార్పొరేషన్‌ యాజమాన్యంలో ఉంది. ఈ కొనుగోలుకు అధికారిక అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.

School Syllabus: ‘బోడి చదువులు వేస్టు’ అని భావిస్తున్నారా?. మరి స్కూల్‌ సిలబస్‌ ఎలా ఉండాలో చెప్పండి..

ఒక్క తైవాన్‌లోనే..

ఇండియన్‌ మొబైల్‌ మార్కెట్‌లో ఉపయోగించే అన్ని రకాల చిప్‌ల్లో దాదాపు 75 శాతం ఒక్క తైవాన్‌లోనే తయారవుతున్నాయి. ఈ విషయాన్ని ఇండియన్‌ సెల్యులర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. ఈ అసోసియేషన్‌.. దేశీయ, అంతర్జాతీయ మొబైల్‌ డివైజ్‌ల తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అత్యాధునిక లాజిక్‌ చిప్‌ల రూపకల్పనలో తైవాన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఫ్యూచర్‌.. పూర్‌

బ్రెంట్‌ క్రూడాయిల్ ఫ్యూచర్‌ రేట్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. తాజాగా ఒక బ్యారెల్‌ ధర 92 పాయింట్‌ ఎనిమిదీ మూడు డాలర్లకు దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ తర్వాత ఇంత తక్కువ రేటు నమోదుకావటం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ భయాలు నెలకొన్నాయి. అందువల్లే చమురు ధరలు పతనమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

చైనా.. జాబ్‌లెస్‌

కొవిడ్‌ కారణంగా చైనా యువతలో రికార్డ్‌ స్థాయిలో నిరుద్యోగిత రేటు పెరుగుతోంది. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం 19 పాయింట్‌ 9 శాతం జాబ్‌లెస్‌ రేట్‌ నెలకొన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ పూర్తిచేసుకున్న గ్రాడ్యుయేట్ల సంఖ్య తొలిసారిగా ఈ ఏడాది కోటి మార్క్‌ దాటనుంది. ఈ సంఖ్య గతేడాది కన్నా 16 లక్షలకు పైగా పెరుగుతోంది.

ఫ్రీ రేషన్‌ కొనసాగేనా?

కరోనా నేపథ్యంలో నిరుపేదల కోసం ప్రారంభించిన ఆహార ధాన్యాల ఉచిత పంపిణీ పథకం సెప్టెంబర్‌ తర్వాత కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. దీనికి వివిధ కారణాలు దారితీస్తున్నాయి. గోధుమల దిగుమతి భారీగా తగ్గిపోవటం, ప్రధానంగా వరి పంటను సాగు చేసే రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొనటం, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు, ఎన్నికలు తదితర అంశాలు దీనిపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aha OTT
  • business news
  • Free Ration Scheme
  • jobless chaina
  • latest financial news

తాజావార్తలు

  • All Set for Voting: 3 రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం..!

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions