NTV Telugu Site icon

Ambani: ఒక్క స్పీచ్ తో దాదాపు రూ.15,000 కోట్లు సంపాదించిన అంబానీ!

Mukesh Ambani

Mukesh Ambani

దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం గురువారం జరిగింది. దీనిపై కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రసంగించారు. ఈ సందర్భంగా, పెట్టుబడిదారులకు ప్రతి షేరుకు ఒక బోనస్ షేరును అందజేస్తామని ఆయన ప్రకటించారు. కంపెనీ ఏడేళ్ల తర్వాత ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇవ్వబోతోంది. దీని వల్ల కంపెనీకి చెందిన 35 లక్షల మందికి పైగా ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రకటన కారణంగా కంపెనీ షేర్లు 2 శాతానికి పైగా జంప్ చేశాయి. రిలయన్స్ షేర్లలో ఒక నెలలో ఒకే రోజులో ఇదే అతిపెద్ద జంప్. చివరికి షేరు 1.51% లాభంతో రూ.3040.85 వద్ద ముగిసింది. దీని కారణంగా అంబానీ నికర విలువ 1.77 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.14,839 కోట్లు పెరిగింది.

READ MORE: Bad Newz OTT: ఓటీటీలోకి వచ్చేసిన త్రిప్తి దిమ్రీ బోల్డ్ మూవీ ‘బ్యాడ్‌ న్యూజ్‌’!

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. అంబానీ నికర విలువ ఇప్పుడు 114 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆయన నికర విలువ 17.7 బిలియన్ డాలర్లు పెరిగింది. భారతదేశం, ఆసియాలో అంబానీ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. రిలయన్స్ భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ.. అయితే మార్కెట్ క్యాప్ పరంగా ఇది ప్రపంచంలో 45వ స్థానంలో ఉంది. రిలయన్స్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం దాదాపు 245 బిలియన్ డాలర్లుగా ఉంది. రిలయన్స్‌ను త్వరలో ప్రపంచంలోని టాప్ 30 కంపెనీల్లోకి చేర్చనున్నట్టు ఏజీఎంలో అంబానీ తెలిపారు. ప్రస్తుతం.. ఐఫోన్ (iPhone) తయారీదారు ఆపిల్(Apple) $3.493 ట్రిలియన్లతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉంది.