Pallavi Prashanth Bags Bigg Boss 7 Telugu Title: ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగానే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇక ఈ క్రమంలో ప్రశాంత్ కి అందిన నగదు బహుమతి వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. ఇక పల్లవి ప్రశాంత్ అధికారికంగా ఈ సీజన్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో విజేత ఎవరు అనే దానిపై ముందు నుంచి రకరకాల చర్చలు జరిగాయి. ముందు నుంచి శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లలో ఎవరో ఒకరు కప్ గెలుస్తారు అని చర్చ జరిగినా చివరకు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ గెలుచుకున్నాడు. అయితే ఈ టైటిల్ తో పాటు 35 లక్షల నగదు బహుమతిని కూడా ప్రశాంత్ అందుకున్నాడు. నిజానికి విజేత నగదు బహుమతి 50 లక్షలు, కానీ ప్రిన్స్ యావార్ 15 లక్షల ఆఫర్‌ను అంగీకరించడంతో, విజేత నగదు బహుమతి నుండి 15 లక్షలు తగ్గించబడ్డాయి. ఇక నగదు బహుమతితో పాటు, పల్లవి ప్రశాంత్‌కు జోయాలుక్కాస్ నెక్లెస్ తో పాటుగా ఒక బ్రీజా కారు కూడా లభించింది.
Samantha: మళ్ళీ పెళ్లిపై ప్రశ్న.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
పల్లవి ప్రశాంత్ – రైతు బిడ్డ నుండి బిగ్ బాస్ విన్నర్ వరకు ఎదిగిన క్రమం హాట్ టాపిక్ అనే చెప్పాలి. పల్లవి ప్రశాంత్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా కొంత వరకు ఫేమస్ అయినా అతని ఆటతీరు నచ్చి అభిమానులు సహా కామన్ ఆడియన్స్ కూడా అతనికి ఓటు వేయడంతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక ‘రైతు బిడ్డ’గా హౌస్‌లోకి అడుగుపెట్టిన అతను ఫిజికల్ టాస్క్ లలో తన కఠోర శ్రమతో, ఎలిమినేషన్ సమయంలో ఎదుటివారితో దూకుడుగా ప్రవర్తిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇక తాజా లెక్కల ప్రకారం అర్జున్ అంబటి ఆరో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు, ప్రియాంక జైన్ ఐదవ స్థానంలో హౌస్ నుండి నిష్క్రమించాడు. ఇక ప్రిన్స్ యావర్ 15 లక్షల రూపాయల విలువైన నగదును స్వీకరించి బయటకు వచ్చాడు. ఇక శివాజీ ఈ సీజన్‌లో మూడవ స్థానంతో తప్పుకోగా అమర్‌దీప్ చౌదరి రన్నరప్‌గా నిలిచారు.. అలా చివరికి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్‌ను గెలుచుకున్నారు.