బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ లో 13 వ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చాడు.. గౌతమ్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుత హౌస్ లో ఏడుగురు ఉన్నారు. అశ్వద్ధామ 2.0అంటూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ తన దైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొత్తం 13 వారలు గౌతమ్ హౌస్ లో ఉన్నాడు. గత రెండు మూడు వారాలుగా శివాజితో గొడవ పెట్టుకుంటున్నాడు గౌతమ్. నామినేషన్స్ లోనూ సిల్లీ రీజన్స్ తో శివాజిని నామినేట్ చేసి ఆయనతో వాగ్వాదం పెట్టుకుంటున్నాడు గౌతమ్…
నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో కూడా శివాజీ తో గొడవకు దిగాడు.. గత వారం శోభా, గౌతమ్ లు డేంజర్ లో ఉన్నారు.. ఇక ఈ సారి కూడా బిగ్ బాస్ దత్త పుత్రికను సేవ్ చేశాడు.. ఇక గౌతమ్ అవుట్ అయ్యాడు.. ఇక గౌతమ్ ఈ 13 వారాలకు బాగానే రెమ్యూనరేషన్ ను తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. చాల ఎపిసోడ్ లో గౌతమ్ అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు. అసలు గేమ్ ఆడినట్టు కూడా కొన్ని సార్లు కనిపించలేదు. కంటెంట్ ఇవ్వడంలోనూ గౌతమ్ పెద్దగా పర్ఫామ్ చేయలేక పోయాడు..
ఏది ఏమైనా శివాజితో మంచిగా ఉండి ఉంటే ఫైనల్ వరకు ఉండేవాడేమో అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. గౌతమ్ రెమ్యునరేషన్ విషయానికొస్తే.. వారానికి రూ 1.75 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అని గౌతమ్ డీల్ సెట్ చేసుకున్నాడట. అంటే 13 వారాలకు గానూ దాదాపు రూ 22.75 లక్షలు పారితోషికంగా అందుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా గరం గరంగా జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ వారంకు నామినేషన్స్ కూడా ఈరోజు రేపు జరుగుతున్నాయి.. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..