తెలుగులో ప్రసారం అయిన టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల ముగిసింది.. ఈ షోలో ఈ సారి కామన్ మ్యాన్ కు పట్టం కట్టారు.. టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలవగా, అమర్ రన్నర్ గా నిలిచారు.. ఈ షోలో చివరివరకు ఉన్న స్ట్రాంగ్ కంటేష్టంట్స్ లో ప్రియాంక జైన్ కూడా ఒకరు..శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్ ఫైనల్ కి వెళ్లిన విషయం తెలిసిందే.. ఫైనల్ వరకు వెళ్ళిన లేడీ కంటెస్టెంట్ ప్రియాంక..
ప్రియాంక టాస్క్ లలో గట్టి పోటీ ఇచ్చింది. అబ్బాయిలతో పోటీ పడి ఫిజికల్, మెంటల్ టాస్క్ లలో సత్తా చాటింది. చాలా టాస్క్స్ లో ప్రియాంక చివరి వరకు వచ్చింది. ఒకసారి కెప్టెన్ అయ్యింది. ఎక్కువగా కెమెరాల ముందు కనిపించకుండా ఉండటమే ఆమెకు మైనస్ అయ్యింది.. అమర్, శోభ, ప్రియాంక ఒక టీమ్ గా ఆడారు. దీనిపై విమర్శలు వస్తున్నా వాళ్ళ స్నేహం కొనసాగింది. చివరి వారాల్లో హోస్ట్ నాగార్జున ఇదే విషయమై ప్రియాంకను హెచ్చరించాడు.. టైటిల్ ను కొట్టలేకున్నా కూడా అభిమానుల మనసు దోచుకుంది.. 15వారాలు హౌస్‌లో ఉన్న ప్రియాంక గట్టిగానే రాబట్టారని సమాచారం.
ఇక వారానికి రూ. 2.5 లక్షల ఒప్పందంపై హౌస్‌లో అడుగుపెట్టిందట. మొత్తంగా రూ. 37.5 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకుంది. ఈ డబ్బులతో ఆమె పెళ్లి చేసుకోనుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. సీరియల్ నటుడు శివ కుమార్ ని ప్రేమిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ వీక్ లో శివ కుమార్ హౌస్‌లోకి వచ్చాడు. ఆమెపై ముద్దుల వర్షం కురిపించాడు. బిగ్ బాస్ హౌస్‌లోనే పెళ్లి చేసుకుందామని ప్రియాంక ప్రియుడిని కోరింది.. బయటకు వచ్చాకే చేసుకుందాం అనుకున్నారు.. మరి ఎప్పుడు వీరిద్దరూ వివాహం చేసుకుంటారో చూడాలి.. త్వరలోనే వీరి పెళ్లి ప్రకటన వస్తుందని అభిప్రాయపడుతున్నారు..