బిగ్ బాస్ 5 గత వారం ఎలిమినేషన్ తరువాత బాగా స్లో అయినట్టు అన్పిస్తోంది. గత రెండు మూడు ఎపిసోడ్లు అయితే మరీ చప్పగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు పెట్టినప్పటికీ అవి పెద్దగా ఆసక్తికరంగా సాగడం లేదు. ఇలా జరిగితే ఛానెల్‌ని మార్చడానికి ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే షో నత్త నడకన నడుస్తోంది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రవి విషయం వెలుగులోకి వచ్చాక లహరి ఇంట్లో ఉండి ఉంటే ఎపిసోడ్ లు మరింత హాట్ గా ఉండేవి. ఇంటి వాతావరణం వేడెక్కేది. కానీ ఆమె వెళ్ళిపోయాక మరీ సైలెంట్ గా అన్పిస్తోంది. నటరాజ్ మాస్టర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన చేష్టలు చివరికి కామెడీగా మారుతున్నాయి. ఆయన చెప్పే మాటలు, వేసే డైలాగులు ఆయన కమెడియన్ గా మారుస్తున్నాయి.
Read Also : షాకింగ్ : టాలీవుడ్ నటి ఆత్మహత్య
దీంతో ఇప్పటికైనా కొత్త పోటీదారులను వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్ లోకి పంపడం మంచిదని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నవ్య స్వామి, వర్షిణి, విష్ణుప్రియ వంటి వారు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే అందులో విష్ణు ప్రియ తాను బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టే ప్రసక్తే లేదని తేల్చేసింది. మరి మిగతా ముగ్గురి పరిస్థితి ఏంటో తెలియదు. ఈ పరిస్థితిలో మేకర్స్ వైల్డ్ కార్డు ఎంట్రీకి ప్లాన్ చేస్తే టిఆర్‌పి లు పెరిగే ఛాన్స్ ఉంది.