బిగ్ బాస్ హౌస్ నుండి అనారోగ్య కారణంగా జెస్సీని బయటకు పంపిన నిర్వాహకులు వైద్యులతో అన్ని రకాల పరీక్షలూ చేయించి, అతను సేఫ్ అనే నిర్థారణకు రావడం సంతోషించదగ్గది. అయితే కరోనా ప్రివెంటివ్స్ నెపంతో జెస్సీని బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో క్వారంటైన్ చేశాడు. అక్కడ నుండి హౌస్ మేట్స్ వ్యవహార శైలిని జెస్సీ చూసే ఏర్పాట్లు జరిగాయి. ఇక జెస్సీ వెళ్ళిపోయిన తర్వాత సహజంగానే నామినేషన్స్ ప్రకియ కు సంబంధించి జైలు నుండి ఎవరు ఎవరిని విడుదల చేశారు? ఎవరు ఆ తర్వాత నామినేట్ చేశారు? అంటూ చర్చోపచర్చలు జరిగాయి. ప్రధానంగా షణ్ముఖ్ ను కాజల్ సేవ్ చేస్తుందని భావించని సన్నీ, మానస్ ఆమె మీద ఆరోపణల దాడి చేశారు. అలానే పింకీ జైలు నుండి మానస్ ను సేవ్ చేసినా, చివరకు జెస్సీని సేవ్ చేయడాన్ని వారిద్దరూ తప్పు పట్టారు. ఎంతో కాలంగా స్నేహం ఉన్నా, నామినేషన్స్ దగ్గరకు వచ్చే సరికీ కాజల్, పింకీ తమకు యాంటీగా ఉన్నారనే బలమైన భావనకు సన్నీ, మానస్ వచ్చేశారు. పింకీ, కాజల్ ఎంత బ్రతిమిలాడినా వారు వినకపోగా, తిరిగి సెటైర్స్ వేయడం మొదలు పెట్టారు. అయితే… ఒక రోజు గడిచిన తర్వాత ఆ వేడి కాస్తంత చల్లారింది.
Read Also : చిక్కుల్లో పడబోతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్
ఇదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లోకి ఓ కేక్ ను పంపి, ‘ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది?’ అనే ప్రశ్నవేశాడు. ఎవరికి వారు తామే అర్హులమనే భావన వ్యక్తం చేశారు. ఒక రోజు గడిచిన తర్వాత ఆలోచిద్దామని కెప్టెన్ యానీ చెప్పింది. కానీ ఆ తర్వాత సన్నీ కేక్ ను తినేసి, ఎలాంటి పర్యావసానానికైనా తాను సిద్ధమనే ఇండికేషన్ ఇచ్చేశాడు. సన్నీ చర్య కరెక్టా? కాదా? అనేది బుధవారం ఎపిసోడ్ లో తేలుతుంది. ఇదే సమయంలో సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీని ‘కేక్ తినే అర్హత నీ దృష్టిలో ఎవరికి ఉందో చెప్పమ’ని బిగ్ బాస్ కోరాడు. మరి జెస్సీ ఎవరి పేరు చెప్పాడు? అనేది తెలియాల్సి ఉంది! ఏదేమైనా… కేక్ పుణ్యమా అని నామినేషన్స్ ప్రక్రియలో జరిగిన వాడీ వేడీ చర్చ నిదానంగా చల్లబడటం మొదలైంది.