బిగ్ బాస్ 5 : షన్నుపై పెరుగుతున్న నెగెటివిటీ… ఇదే కారణమా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్-5” వీకెండ్ కు వచ్చేసింది. అయితే ఇప్పుడు షో చివరి దశకు చేరుకోగా హౌస్ లో కాజల్, సిరి, సన్నీ, మానస్, షన్ను, సింగర్ శ్రీరామ్ ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ లపై ప్రేక్షకుల అభిప్రాయాలు మారిపోతున్నాయి. 100 రోజులకు పైగా వారిని చూడటం వల్ల వారి గురించి ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. అయితే ఆ అభిప్రాయం కొన్నిసార్లు పాజిటివ్ అయితే మరికొన్ని సార్లు మాత్రం నెగెటివ్ గా ఉంటోంది. తాజాగా షణ్ముఖ్ జస్వంత్ పరిస్థితి అలాగే మారింది. ఈ సోషల్ మీడియా స్టార్ “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకరు. ఫైనల్‌లో టాప్ 3 కంటెస్టెంట్స్‌లో స్థానం సంపాదిస్తాడని అంచనాలు ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా అతని ప్రవర్తన ప్రేక్షకుల్లో నెగెటివిటీని తెస్తోంది.
Also Read
సిరితో షణ్ణు రిలేషన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం హౌస్ లోకి అడుగు పెట్టిన సిరి తల్లి ఒకరినొకరు కౌగిలించుకోవడం మానేయమని మొహం మీదే చెప్పేసింది. గత రాత్రి ఎపిసోడ్‌లో ఇతర హౌస్‌మేట్స్ టాస్క్‌లో సిరిని అనుకరిస్తున్నప్పుడు తనకు తగినంత గౌరవం ఇవ్వనందుకు, తన వైపు నిలబడనందుకు షన్ను సిరిపై అరుస్తూ కనిపించాడు. షన్ను ప్రవర్తన పై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. షణ్ణు సిరిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని, కన్ఫ్యూజ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మరి ఈ నెగెటివిటి కారణంగా ఆయన పాపులారిటీ దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా అది పరోక్షంగా అతని టైటిల్ గెలుచుకునే అవకాశాలను ప్రభావితం చేయవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..