“బిగ్ బాస్ 5” ఆసక్తికరంగా సాగుతోంది. అప్పుడే ఈ షో మూడవ వారానికి చేరుకుంది. అయితే గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో ఏం వెతికినా ఇట్టే తెలిసిపోతుంది. దానికి సంబంధించిన సమాచారం సెకన్లలో మన కళ్ళ ముందు ఉంటుంది. అయితే గూగుల్ కూడా అప్పుడప్పుడు తప్పులో కాలేస్తుంది. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ ను తప్పుగా చూపిస్తే మరికొన్ని సార్లు భవిష్యత్ ను ముందే చెప్పేస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే తాజాగా “బిగ్ బాస్ 5” టైటిల్ విన్నర్ ఎవరో చెప్పేసింది. గూగుల్ లో “బిగ్ బాస్ 5” విన్నర్ అని సెర్చ్ చేస్తే మాజీ ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామచంద్ర పేరును చూపిస్తోంది. ఇంకా ఈ షో స్టార్ట్ అయ్యి మూడవ వారమే అయ్యింది. అప్పుడే గూగుల్ ఇలా విన్నర్ అంటూ శ్రీరామచంద్ర పేరును చూపించడం విశేషం.
Read Also : “వరుడు కావలెను” రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీరామ చంద్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్లేబ్యాక్ సింగర్ గా కెరీర్‌ని ప్రారంభించాడు. మ్యూజిక్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ 5 విజేతగా నిలిచాడు. 2013లో ఆయన ‘జగద్గురు ఆది శంకర’ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి నట ప్రవేశం చేసాడు. ప్రస్తుతం నాగార్జున హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్ 5” తెలుగులో కంటెస్టెంట్ గా ఉన్నారు. సరయు, ఉమా దేవి ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. మూడవ వారంలో మానస్, శ్రీరామ చంద్ర, లహరి, ప్రియాంక, శైలజ ప్రియ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. ఈ వారం కెప్టెన్ గా జెస్సి ఎంపికయ్యాడు.