పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ 5″ 11వ వారంలోకి చేరుకుంది. ముందుగా పెద్దగా అంచనాలేమీ లేకుండా హౌజ్ లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లో చాలామంది బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న అతికొద్ది మంది ప్రభావం సోషల్ మీడియాలో బాగానే కన్పిస్తోంది. ముఖ్యంగా వీజే సన్నీకి భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. గతవారం సన్నీ, షణ్ముఖ్ మధ్య జరిగిన మాటల యుద్ధం కారణంగా ఇద్దరూ ట్రెండింగ్ లోకి వచ్చారు. అయితే ఈ వీకెండ్ జరిగిన ఎపిసోడ్ లో నాగ్ తో పాటు అందరూ సన్నీనే టార్గెట్ చేయడం ప్రేక్షకులకు నచ్చినట్టు లేదు. మొదటి నుంచీ హౌజ్ లో సన్నీనే టార్గెట్ చేస్తున్నారు. అందుకే సన్నీని టార్గెట్ చేయడం ఆపండి అంటూ ఆయనకు సపోర్ట్ గా “బిగ్ బాస్ 5 సెన్సేషన్ సన్నీ” అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇదంతా చూస్తుంటే గత సీజన్లో కౌశల్ గుర్తొస్తున్నాడు. ‘బిగ్ బాస్ 2’ విన్నర్ గా నిలిచిన కౌశల్ ను కూడా అందరూ ఇలాగే టార్గెట్ చేయగా, ఆయనకు బయట భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఇదే తరహాలో సన్నీ సంచలనంగా మారాడు. ఈ సీజన్ విజేతగా సన్నీనే నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Read Also : కేబీఆర్ పార్క్ లో సినీ నటిపై దాడి