బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” పదవ వారం విజయవంతంగా నడుస్తోంది. ఈ వారం జరిగిన టాస్కుల్లో రవి బిగ్ బాస్ హౌజ్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత 9 వారాల్లో 8 వారాలు నామినేషన్ లో ఉన్న రవికి కెప్టెన్సీ మంచి బూస్ట్ ఇచ్చినట్లే. ఇదిలా ఉండగా షో పదవ వారం ఎండింగ్ కు చేరుకుంది. ఈ ఆదివారం హౌజ్ నుంచి ఒకరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ వారానికి గానూ నామినేషన్లలో రవి, మానస్, సన్నీ, కాజల్, సిరి ఉన్నారు. అయితే కెప్టెన్ కావడంతో రవి సేఫ్ అని భావించొచ్చు. ఇంకా మిగిలిన నలుగురిలో ఒకరు బయటకు వెళ్ళబోతున్నారు. రేపటి ఎపిసోడ్ లో కాజల్ ఎలిమినేట్ కానుందని సమాచారం. కాజల్‌కి అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బయటకు వెళ్ళక తప్పదు అంటున్నారు. అయితే మరోవైపు సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సి ఆరోగ్యం ఏమాత్రం బాగోలేకపోవడంతో జెస్సిని సైతం బయటకు పంపించొచ్చు అంటున్నారు. మరి ఈ వారం కాజల్ బయటకు వెళ్తుందా ? లేదా జెస్సినా ? లేదంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ? చూడాలి.
Read Also : తెలంగాణ ఆర్టీసీ దెబ్బకు దిగివచ్చిన రాపిడో !