బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 8 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగే అదరగొడుతున్నారు. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లిపోయారు. మరికొందరు వైల్డ్ కార్డు ఎంట్రీగా మరికొందరు హౌస్ లో అడుగుపెట్టారు. సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి వివిధ సినిమా సెలెబ్రిటీస్ కూడా అడుగుపెట్టి కంటెస్టెంట్స్ తో సరదాగా గడుపుతున్నారు.
Also Read : Allu Arjun : పుష్ప – 2 అంటే ఆ మాత్రం భయం ఉండాలా..
ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 సెట్స్ లో తమిళ స్టార్ హీరో సూర్య అడుగుపెట్టాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా కంగువ ప్రమోషన్స్ లో భాగంగా విచ్చేసి సినిమా విశేషాలతో పాటు పలు సరదా సంభాషణలను కూడా పంచుకుంటూ హౌస్ మేట్స్ కు ఎంకరేజ్ మెంట్ ఇచ్చి వెళ్లారు. తాజాగా మరో హీరో కూడా సూర్య ని ఫాలో అవుతూ తమ సినిమాను తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చేస్తున్నారు. తమిళ స్టార్ హీరోలలో ఒకరైన శివకార్తికేయన్ తెలుగు బిగ్ బాస్ లో అడుగుపెడుతున్నారు. అయన నటించిన భారీ బడ్జెట్ చిత్రం అమరన్ దీపావళి కనుకగా అక్టోబరు 31న రిలీజ్ కానుంది. అందులో భాగంగా తెలుగులో నేడు అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ విచ్చేసిన శివకార్తికేయన్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లో అమరన్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందుకు సంబందించిన షూటింగ్ ను నేడు పూర్తి చేయనున్నారు మేకర్స్. త్వరలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రానుంది.