బుల్లితెర ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన మోస్ట్ సక్సెస్ ఫుల్ షో బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ ఈ ఆదివారం గ్రాండ్ గా స్టార్ట్ అయింది. గత 7 సీజన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 గత సీజన్స్ కంటే భిన్నంగా సరికొత్తగా తీసుకువచ్చారు. మొదటి రోజు కంటెస్టెంట్స్ పరిచయాలతో ముగిసింది. ఇక తాజాగా ఈ సీజన్ రెండవ రోజు ప్రోమో రిలీజెన్ చేశారు.
Also Read : Gadadhari Hanuman: పాన్ ఇండియా భాషలలో ‘గదాధారి హనుమాన్’.. ?
ఈ సారి బిగ్ బాస్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ సీజన్ మొత్తంలో బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అంటూ ఎవరు ఉండరని హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు. ఇక రెండవ రోజు నుండే బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య వార్ మొదలైంది. టీమ్ సభ్యులు ఆరెంజ్ ఫ్రూట్ తో గేమ్ ఆడే క్రమంలో శేఖర్ భాషా, సోనియా మధ్య వాగ్వివాదం జరిగింది. ఎవరైతే అరెంజెస్ తో ఆడుతున్నారో వాళ్ళు మిగిలిన ఆరెంజెస్ ముట్టుకోవడానికి వీల్లేదని సోనియా అనడంతో ఆలా ముట్టుకోవద్దని బిగ్ బాస్ రూల్ పెట్టాడా అని శేఖర్ బాషా సోనియాకు బదులివ్వడంతో వాదోపవాదాలు నడిచాయి. మరోవైపు సోనియా, యాష్మి మధ్య కూడా డిబేట్ నడిచింది. అదేవిధంగా హౌస్ లో మొదటి ఛాలెంజ్ గా పట్టుకోండి చూద్దాం అనే టాస్క్ ను ఇచ్చాడు బిగ్ బాస్. మరి ఈ గేమ్ లో ఎవరు గెలిచారు అనేది రేపటి ఎపిసోడ్ లో తేలనుంది. డే 1 నుండే ఈ సీజన్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతోంది.