బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మొదలైంది తెలుగు సీజన్ 7లో రెండు వారాలు పూర్తి చేసుకుంది.. ఇప్పుడు మూడో వారంలోకి అడుగుపెట్టింది.. మొదటివారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం 9 మంది నామినేట్ కాగా శివాజీ పవర్ అస్త్ర గెలిచిన కారణంగా ఎలిమినేషన్ నుండి తప్పుకున్నాడు.. అమర్ దీప్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ వరుసగా సేఫ్ అయ్యారు. చివర్లో తేజా, షకీలా మిగిలారు. వీరిద్దరినీ యాక్టివిటీ రూమ్ కి పిలిచిన నాగార్జున ఇద్దరిలో ఎవరి ఫోటో వస్తే వాళ్ళు సేఫ్ అన్నాడు.
ఇక తేజా ఫోటో రాగా అతడు సేవ్ అయ్యాడు. షకీలా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. షకీలా బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం హౌస్లో 12 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరిని నామినేట్ చేయడానికి వీల్లేదు. పవర్ అస్త్ర గెలిచిన శివాజీ 4 వారాలు, సందీప్ 5 వారాల ఇమ్యూనిటీ పొందారు. మిగిలిన 10 మంది సభ్యులు ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంది.. అప్పుడే నామినేషన్స్ రసవత్తరంగా మారుతున్నాయి..
ప్రియాంక ఆమె ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ లను నామినేట్ చేసింది. ఆమె చెప్పిన కారణాలకు ప్రిన్స్ యావర్ ఒప్పుకోలేదు. అనంతరం పల్లవి ప్రశాంత్ వచ్చాడు. అతడు తేజా, దామినిలను నామినేట్ చేశాడు. ప్రతిసారి నేను వంట చేస్తున్నానని చెప్పుకోవడం నచ్చలేదని పల్లవి ప్రశాంత్ దామిని తప్పు బట్టాడు. తేజా విషయంలో సరైన రీజన్ ఇవ్వలేకపోయాడు. ఇక శోభ శెట్టి… శుభశ్రీ, రతికాలను నామినేట్ చేసింది. రతికా వలన మొత్తం హౌస్ ఇబ్బందులు పడుతుందని చెప్పింది. అమర్ దీప్ చౌదరి… గౌతమ్, శుభశ్రీలను నామినేట్ చేశాడు.. ఇలా ఒక్కొక్కరు ఇద్దరినీ నామినేట్ చేశారు.. అలా ఈవారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది.. మూడో వారం వీరిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్ళేది శుభ శ్రీ అని ఇప్పటికే నెట్టింట వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. మరి చివరికి ఎవరు వెళ్తారో తెలియాల్సి ఉంది..