Bigg Boss Telugu 7: శుభ శ్రీ ని టార్గెట్ చేసిన రతికా..మరో యాంగిల్ ను చూపిస్తున్న యావర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ఎలిమినేషన్ ను పూర్తి చేసుకుంది.. నిన్న హౌస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యింది.. ఇక నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది.. నామినేషన్స్ కు సంబందించిన ఎపిసోడ్ ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇందులో ముఖ్యంగా శుభ శ్రీ, రతిక మధ్య వాదనలు పీక్‌కి వెళ్లాయి. అలాగే యావర్, గౌతం కృష్ణల మధ్య వాదనలు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. మరోవైపు యావర్‌ని తేజ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. నేను ఇలానే ఉంటానంటూ ఫైర్ అయ్యారు. ఇక ప్రోమోల్లో నిన్న జరిగిన ఎపిసోడ్‌కి సంబంధించి రతిక, శివాజీల మధ్య వాదన జరిగింది..
రతికా మళ్లీ అదే అనడంతో శివాజీ కాళ్లు పట్టుకోమంటావా.. లేదా ఇంకేదైనా ఉందా అంటూ అరుస్తాడు.. అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి, దాన్ని ఇతర ఇద్దరు అంగీకరించాలి. పవర్ అస్ర్త సాధించిన వాళ్లు నామినేషన్లకి మినహాయింపు. దీంతో శివాజీ, సందీప్, శోభా శెట్టి జడ్జ్ లు గా వ్యవహరించారు.. ఇక ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారు. అనంతరం టాస్క్ లలో మునిగి పోయారు.. ఇక శుభ శ్రీ నామినేట్ చేసిన వారిలో అమర్ దీప్ కూడా ఉన్నాడు. ఇంట్లో నేనేమీ పనులు చేయలేదా.. అంటూ ప్రశ్నించాడు. నువ్వు మాత్రం కేవలం చపాతిలు మాత్రమే చేస్తావని, శుభ శ్రీ రోటీస్ అని బోర్డ్ పెట్టుకో అంటూ సెటైర్లు పేల్చాడు అమర్ దీప్. ఈ సందర్బంగా ఓ విషయాన్ని ఆయన వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకుల్లో ఎపిసోడ్ ప్రోమో ఆసక్తిగా మారింది..
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
ఆ తర్వాత యావర్, గౌతమ్ ల మధ్య గొడవ జరుగుతుంది.. ఒకరికరు తిట్టుకుంటున్నారు.. హౌస్ లో ఎప్పుడూ చూడని విధంగా యావర్ సీరియస్ అవ్వడం ఎపిసోడ్ కు హైలెట్ అయ్యింది..యావర్ .. ప్రియాంక, తేజలను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో శోభా, ప్రియాంక ఫెమినిజం ప్లే చేస్తూ గేమ్ ఆడుతున్నారంటూ నోరు జారాడు. దీంతో జడ్జ్ గా ఉన్న శోభా శెట్టి ఫైర్ అయ్యింది. ఆ విషయం తేలే వరకు తాను ఆర్గ్యూకి ఒప్పుకోనని తెలిపింది. అయితే తనని పవర్ అస్త్ర పోటీ నుంచి తొలగించడం విషయంలో యావర్ హర్ట్ అయినట్టు తెలిపారు. అనంతరం తేజ, యావర్ మధ్య రచ్చ జరిగింది… మొత్తానికి ఈ నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా హాట్ హాట్‌గా జరిగిందని ప్రోమోలను బట్టి తెలుస్తుంది.. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..
తాజావార్తలు
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!